సినిమా ఇండస్ట్రీలో ఎంత పోటీ ఉంటుందో, అంతే స్నేహం కూడా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఒక హీరో, ఒక దర్శకుడు చాలా కాలం కలిసి ట్రావెల్ చేస్తారు కాబట్టి వారు ఎక్కువగా స్నేహితులు అవుతారు.
అలా మన ఇండస్ట్రీలో ఒక హీరోకి ఒక దర్శకుడు బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం జరుగుతూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు తమతో పని చేసిన దర్శకులతో స్నేహంగా ఉన్నారు. అలా మన ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరోలకి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్
ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో ఒక దర్శకుడు, ఒక హీరో బెస్ట్ ఫ్రెండ్ అంటే మొదటిగా గుర్తొచ్చేది వీళ్లిద్దరే. ఎన్నో సంవత్సరాల నుండి వీరి మధ్య స్నేహం ఉంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలకి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాశారు. ఇటీవల రిలీజ్ అయిన బ్రో సినిమా రూపొందడంలో కూడా త్రివిక్రమ్ చాలా ప్రధాన పాత్ర వహించారు.

#2 మహేష్ బాబు – వంశీ పైడిపల్లి
మహర్షి సినిమాకి వీరిద్దరూ కలిసి పని చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు అయ్యారు. మహేష్ బాబుకి సంబంధించిన చాలా ఈవెంట్స్ లో వంశీ పైడిపల్లి పాల్గొంటూ ఉంటారు. వీరి కుటుంబానికి కూడా చాలా మంచి అనుబంధం ఉంది అని సోషల్ మీడియాలో వీరి పిక్చర్స్ చూస్తే అర్థం అవుతుంది.

#3 జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి
రాజమౌళి మొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాలకి పని చేశారు. ఆ సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. అంతే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీరిద్దరికీ, అలాగే వీరి కుటుంబాలకి చాలా మంచి స్నేహం ఉంది.

#4 షారుఖ్ ఖాన్ – కరణ్ జోహార్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ చాలా మంచి మిత్రులు. అంతే కాకుండా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో షారుఖ్ ఖాన్ హీరోగా కూడా చేశారు. అలా వీరిద్దరి స్నేహం మరింత బలపడింది అని చెప్పవచ్చు.

#5 శివకార్తికేయన్ – నెల్సన్ దిలీప్ కుమార్
తమిళ్ హీరో శివ కార్తికేయన్, దర్శకుడు నెల్సన్ కూడా చాలా మంచి స్నేహితులు. నెల్సన్ ఇప్పటికి నాలుగు సినిమాలకి దర్శకత్వం వహించారు. అందులో నెల్సన్ రెండవ సినిమా అయిన డాక్టర్ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించారు. నెల్సన్ మొదటి సినిమా కోలమావు కోకిల, అలాగే మూడవ సినిమా అయిన బీస్ట్ సినిమాలో శివకార్తికేయన్ పాటలు రాశారు. ఇప్పుడు నెల్సన్ జైలర్ సినిమాకి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అని అంటారు.

#6 అల్లు అర్జున్ – సుకుమార్
సుకుమార్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా అయిన ఆర్య లో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఆర్య 2 కి పని చేశారు. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమాతో ఇద్దరూ చాలా మంచి హిట్ కొట్టారు. వీరిద్దరి ఇంటర్వ్యూలు చూస్తే వీళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులు అనే విషయం అర్థం అవుతుంది.

#7 రవితేజ – పూరి జగన్నాధ్
వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలకి పని చేశారు. మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిగా వీరిద్దరూ దేవుడు చేసిన మనుషులు సినిమాకి పని చేశారు.

వీరు మాత్రమే కాకుండా ఇంకా మన ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో డైరెక్టర్ స్నేహితులు ఉన్నారు.
ALSO READ : JD చక్రవర్తి నటించిన ఈ సిరీస్ చూశారా..? ఎలా ఉంది అంటే..?




















 శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు. ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





