పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్- కే’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘ప్రాజెక్ట్- కే’ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ను ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ రీలజ్ చేయనున్నారు. దాంతో పాటుగా ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేయబోతున్నారని సమాచారం. అయితే ప్రాజెక్ట్- కే టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కాలిఫోర్నియాలో జులై 20న జరుగనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ ఈవెంట్ అడుగుపెట్టనున్న మొదటి ఇండియన్ మూవీగా ‘ప్రాజెక్ట్ కే’ చరిత్ర సృష్టించబోతుంది. ఈ వేడుకలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్-కే అర్ధం ఏమిటనే ఇంట్రెస్ట్ అందరిలోనూ మరింతగా పెరిగింది. అది మాత్రమే కాకుండా మూవీ మేకర్స్ సైతం ప్రాజెక్ట్-కే అంటే తెలుసుకోవాలని ఉందా? అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్ట్-కే అంటే ముందుగా కర్ణ, కల్కీ అనే టైటిల్స్ వైరల్ గా మారాయి. కానీ ప్రస్తుతం మాత్రం ప్రాజెక్ట్ కే మూవీకి ‘కాలచక్ర’ అని ఫైనల్ చేశారని వినిపిస్తోంది.
సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ నేపథ్యం బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో ‘కాలచక్ర’ అనే టైటిల్ ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. మరి టైటిల్ ఇదేనా కాదో తెలియాలంటే జులై 20 వరకు వేచి చూడాల్సిందే. ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ ఈవెంట్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోనే, నాగ్ అశ్విన్ పాల్గొననున్నారని తెలుస్తోంది.
Also Read: “హిట్ టాక్ వస్తే క్రేజ్ ఈ రేంజ్ లో ఉందా..?” అంటూ… వైష్ణవి చైతన్య “బేబీ” రిలీజ్‌పై 15 మీమ్స్..!

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించిన మూవీ బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేశ్ డైరెక్షన్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్, డైలాగుల వంటివి ఈ చిత్రం పై అంచనాలు పెరిగేలా చేశాయి. హీరో విజయ్ దేవరకొండ `బేబీ` ప్రీమియర్ చూసిన తరువాత ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి షోతొనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య మొదటిససారిగా హీరోయిన్ గా నటించింది. వైష్ణవి యూట్యూబ్ వీడియోల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో మూవీలో బన్నీ చెల్లిగా వైష్ణవి నటించింది. పలు సినిమాలలో చిన్న పాత్రలలో నటించింది.
బేబీ మూవీలో వైష్ణవి చైతన్య నటనతో ఆడియెన్స్ ఆకట్టుకుందని టాక్ వినిపిస్తోంది. మూవీ కూడా చాలా సహజంగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల మీడియాలో బేబీ మూవీ రిలీజ్ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు కూడా చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.


హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పలు ఆలయాలను దర్శిస్తూ, అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో అమీన్ పీర్ దర్గాను సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నాడు. ఆ తరువాత కాణిపాకం చేరుకుని కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని, పూజలు నిర్వహించాడు. అక్కడి నుంచి సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తికి వెళ్లాడు.
సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామికి సాయి ధరమ్ తేజ్ స్వయంగా హారతి ఇచ్చారు. ప్రస్తుతం అది వివాదాస్పదంగా మారింది. శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్య స్వామికి పూజారి తప్ప వేరే వ్యక్తులు ఎవరు కూడా హారతిని ఇవ్వకూడదట. హీరో అయితే హారతి ఇవ్వడానికి ఎలా అనుమతి ఇచ్చారని గుడి అధికారులను భక్తులు ప్రశ్నిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఎలా హారతి ఇస్తాడని అతని పై కొందరు మండిపడుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత అంతగా బయటకు రాలేదు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఇది తనకు పునర్జన్మ అని, భగవంతుడు పునర్జన్మ ప్రసాదించారని, అందుకే ఆలయాలను సందర్శించి, పూజలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు.
టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ట్రైలర్ తో ఇప్పటికే వావ్ అనిపించిన మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా పై హైప్ పెంచుతూ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలతో ఈ మూవీ మరింత క్రేజ్ పెరిగింది. దాంతో ఈ సిరీస్ నుండి కొత్త మూవీ వస్తున్న ప్రతిసారి ఆడియెన్స్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. దానికి తగినట్టుగా మిషన్ ఇంపాజిబుల్ 7 వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయ్యింది. ఈ మూవీకి ఇండియాలో కూడా ఎక్కువ థియేటర్లు లభించాయని తెలుస్తోంది.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, సముద్రంలో మునిగిపోయిన ఒక సబ్ మెరైన్ లో ప్రపంచానికి చెడు చేసే ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యాన్ని కనిపెట్టాలంటే 2 భాగాలు ఉన్న తాళం చెవి కావాలి. ఆ తాళం చెవిని వెతికే బాధ్యతను ప్రభుత్వ ఆఫీసర్లకి అప్పగిస్తుంది. వారితో పాటు హంట్ (టామ్ క్రూజ్) కూడా రంగంలోకి దిగుతాడు. కీ వెతికే సమయంలో వారికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని ఫైనల్ కీని ఎలా సంపాదిస్తారు అనేది కథ.
మూవీ సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సన్నివేశాలతో నడిపించారు. స్టోరీ పరంగా గొప్పగా ఏమీ లేకపోయినా యాక్షన్ లవర్స్ కోరుకునే సీన్స్ మాత్రం అభిమానులని చాలా ఇంప్రెస్ చేస్తాయి. యాక్షన్ ప్రియులను మెప్పించేలా మూవీ ఉన్నా లెంగ్త్ ఎక్కువయిన భావన వస్తుంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ అయ్యేట్టు ఉంది. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ఆడియెన్స్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా మూవీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు.
తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లలో 6వ సీజన్ తప్ప మిగిలిన సీజన్స్ అన్ని రికార్డ్ స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్స్ ని పొంది సూపర్ హిట్ అయ్యాయి. అతి త్వరలోనే 7వ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా హోస్ట్ హీరో అక్కినేని నాగార్జునే అని తెలుస్తోంది. రీసెంట్ గా నాగార్జునకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తోంది.
ఈ ప్రోమోని త్వరలోనే రిలీజ్ చెయ్యబోతున్నారట. ఇక సీజన్ 7లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో చాలా కఠినమైన రూల్స్ ఉండబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో కంటెస్టెంట్స్ కొన్ని సందర్భాలలో హద్దులు దాటి మరి గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ క్రమంలో నోటి నుండి పొరపాటున బ్యాడ్ వర్డ్ ఒక్కటి బయటికి వచ్చినా సరే ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చి షో నుండి బయటకి పంపేస్తారట.
అది మాత్రమే కాకుండా బిగ్ బాస్ 5వ సీజన్ లో షణ్ముఖ్, సిరల రొమాన్స్ బిగ్ బాస్ షో చూసే ఆడియెన్స్ కు ఎంత ఇబ్బంది కలిగించిందో తెలిసిందే. ఇక ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది. అందువల్ల సీజన్ 7లో అలాంటి రొమాన్స్ జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. హద్దులు దాటి రొమాన్స్ చేసిన వారికి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపిస్తారని టాక్ వినిపిస్తోంది.
స్టార్ హీరోలకు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. దాని వల్ల వారు బయటికి రావడం అంత సులభం కాదు. వారికి సెక్యూరిటీ ఉండాలి. అందులోనూ నమ్మకమైన బాడీ గార్డు కూడా ఉండాలి. రక్షణ కవచం వలె పని చేసే బాడీ గార్డులకు స్టార్ హీరోలు వారి రేంజ్లో జీతాలు ఇస్తున్నారు. వేలల్లో, లక్షల్లో కాదు. వారి ఏడాది జీతం కోటల్లో ఉందంటే ఆశ్చర్యపోక మానరు. వీరి జీతం చిన్న హీరోలలో కొందరి రెమ్యూనరేషన్ తో సమానం.
అందరి కన్నా ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్ రవి సింగ్. ఇతను బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ బాడీగార్డు. రవి సింగ్ నెల జీతం దాదాపు రూ.17 లక్షలు, అంటే సంవత్సరానికి రూ.2.7 కోట్ల పైనే సంపాదిస్తున్నాడు. అతని తరువాతి స్థానంలో ఉన్న బాడీగార్డు షేరా, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్. షేరా సుమారు 29 సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ దగ్గరే బాడీ గార్డుగా ఉన్నాడు. షేరా నెల శాలరీ రూ.15 లక్షలు, అంటే ఏడాదికి రెండు కోట్ల అని తెలుస్తోంది.
అక్షయ్ కుమార్ బాడీగార్డు శ్రేయ్‌సే థెస్లె సంవత్సరానికి రూ.1.2 కోట్ల జీతం అని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ కు బాడీగార్డుగా పనిచేసిన జితేంద్ర షిండే ఏడాదికి రూ.1.5 కోట్లు జీతం తీసుకున్నాడు. ఆరేళ్ల పాటు అమితాబ్ బాడీగార్డ్ పని చేసి 2021 ఆగస్టు తర్వాత మానేశాడు. ఆమిర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ ఘోర్పడేకి సంవత్సరానికి రెండు కోట్లు జీతం అని తెలుస్తోంది. దీపికా పదుకొణె బాడీగార్డ్ జలాల్ కి ఏడాదికి రూ.1.2 కోట్లు, అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాశ్ సింగ్ ఏడాదికి రూ.1.2 కోట్లు జీతం తీసుకుంటునట్లు తెలుస్తోంది.














