సినీ హీరోయిన్లు అన్నాక వారి రేంజ్ వేరు గా ఉంటుంది. కళ్ళు చెదిరే ఫ్యాషన్ దుస్తులతో ముస్తాబవుతారు. వారు తీసుకునే ఫోటోలు సోషల్ మీడియా లో కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి వారి చిన్నప్పటి ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ కింద ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎవరో గుర్తుపట్టారా..?

ఇంకా గుర్తుకు రాలేదా..? ఆమె నిన్నటి తరం లో అందరు అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా నటించారు. రీసెంట్ పాన్ ఇండియా మూవీ లో ప్రభాస్ కు తల్లి గా కూడా నటించారు..? గుర్తొచ్చారా..? ఆమె ఎవరో కాదు… అందాల తార రమ్యకృష్ణ. నమ్మలేకపొతున్నారు కదా..? ఈ ఫోటో ను ఆమె రీసెంట్ గానే తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ వయసులో కూడా ఆమె ఇప్పటి హీరోయిన్లకు గట్టి పోటీనే ఇస్తోంది మరి.
https://www.instagram.com/p/CS9QHfalt9n/?utm_source=ig_embed&ig_rid=b704922e-7c89-4907-a3fc-4e5afd2dfe2f



ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ పై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్, పాత్రల వస్త్రధారణ పై మరియు పాత్రల చిత్రీకరణ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మూవీ డైరెక్టర్ ఓం రౌత్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ పై నెట్టింట్లో చర్చ జరుగుతున్న సమయంలో ఓం రౌత్ పాత ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. అది కూడా 2016లో చేసిన ట్వీట్.
దీనిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులు తెరపైకి తీసుకొచ్చి, ఓం రౌత్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఓం రౌత్ ఆ ట్వీట్ లో షారుక్ ఫ్యాన్ సినిమాతో పొలుస్తూ మరాఠీ సినిమా ‘సైరాట్’ పై ప్రశంసలు కురిపించాడు. అయితే షారుక్ ఫ్యాన్స్ అతని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం రౌత్ ‘మరాఠీ సినిమా ‘సైరాట్’ షారుఖ్ ‘ఫ్యాన్’ సినిమాని క్రాస్ చేసి 80 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది’ అని ట్వీట్ చేశాడు.
ఆదిపురుష్ సినిమాతో ట్రోల్ అవుతున్న ఓం రౌత్‌ను షారుక్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అది కూడా షారుక్ ఒక సందర్భంలో కర్మ గురించి చేసిన ట్వీట్ తో ట్రోల్ చేస్తున్నారు. 500 కోట్ల ‘ఆదిపురుష్’ సినిమా కన్నా 4 కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘సైరాట్’ మూవీ వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.




ఏషియన్ మల్టిప్లెక్స్ థియేటర్స్ లో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ కి ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. హైదరాబాద్ లో ఏఎంబి సినిమాస్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఏషియన్ సినిమాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్టనర్ షిప్ తో ఏఏఏ సినిమాస్ అమీర్ పెట్ లో నిర్మించారు. తాజాగా ఈ మల్టిప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించారు. ఈ వేడుకకు తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.
అమీర్ పెట్ లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన సత్యం థియేటర్ ని పడగొట్టి, ఏఏఏ సినిమాస్ ని నిర్మించారు. 3 లక్షల స్క్వేర్ ఫీట్ లో దీనిని నిర్మించారు. పార్కింగ్ కోసం 2 ఫ్లోర్స్ ని కేటాయించారంట. ఇందులో మొత్తం 5 స్క్రీన్ లు ఉండగా, ఒక్కో స్క్రీన్ 1 67 ఫీట్ల పొడవుతో బార్కో లంజెర్ ప్రొజెక్షన్ తో చిత్రాలను ప్రదర్శిస్తారని తెలుస్తోంది.
రెండవ స్క్రీన్ ఎపిక్ లక్సన్ స్క్రీన్. ముంబైలో తప్ప ఎక్కడ ఈ LED స్క్రీన్ లేదట. ఏఏఏ సినిమాస్ ద్వారా ఈ టెక్నాలజీని మొదటిసారిగా హైదరాబాద్ కి పరిచయం చేస్తున్నారు. ఇక ఈ స్క్రీన్ కి ప్రొజెక్టర్ తో పని లేదంట. కనెక్షన్ ద్వారానే మూవీ ప్లే అవుతుంది. మిగిలిన 3 స్క్రీన్స్ 4K ప్రొజెక్షన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం కలిగి ఉంటుందట. ఆడియెన్స్ కి మూవీ చూస్తే ఇలాంటి థియేటర్ లోనే చూడాలనే అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.

























































