ప్రేక్షకులు ఎప్పుడూ సినిమాలో కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. దర్శకులు, హీరోలు కూడా రొటీన్ అయిపోకుండా తాము పనిచేసే కాంబినేషన్స్ మారుస్తారు. ఒక సినిమాకి సినిమాటోగ్రాఫర్ ని మార్చడం. లేదా సంగీత దర్శకుడి ని మార్చడం. లేకపోతే సినిమాకి ముఖ్యమైన విషయాల్లో ఇంక ఏమైనా మార్చడం చేస్తూ ఉంటారు.
ఇవన్నీ స్క్రీన్ వెనుక. కానీ స్క్రీన్ మీద ముఖ్యంగా హీరో పక్కన ఏ హీరోయిన్ నటించాలి అనేదానిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అలా చూడడానికి కొత్తగా ఉండటం కోసం బాలీవుడ్ నుండి ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్ లో పరిచయం చేశారు. వీళ్లల్లో కొంతమంది డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా బాలీవుడ్ లో నటిస్తూ మళ్లీ మన ఇండస్ట్రీలో పరిచయం అయిన హీరోయిన్లు ఎవరంటే.
#1 సోనాలి బింద్రే – ప్రేమికుల రోజు (తమిళ్ డబ్బింగ్), మురారి

#2 శ్రద్ధా కపూర్ – సాహో

#3 బిపాషా బసు – టక్కరి దొంగ

#4 దీపిక పదుకోన్ – విక్రమసింహ (తమిళ్ డబ్బింగ్) , ప్రభాస్ 21

#5 కియారా అద్వానీ – భరత్ అనే నేను

#6 కంగనా రనౌత్ – ఏక్ నిరంజన్
![]()
#7 విద్యాబాలన్ – ఉరుమి (మలయాళం డబ్బింగ్), ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు

#8 సుష్మితా సేన్ – రక్షకుడు

#9 శిల్పా శెట్టి – సాహస వీరుడు సాగర కన్య

#10 రవీనా టాండన్ – బంగారు బుల్లోడు

#11 అమీషా పటేల్ – బద్రి

#12 ప్రీతి జింటా – ప్రేమంటే ఇదేరా

#13 ట్వింకిల్ ఖన్నా – శీను

#14 మనీషా కొయిరాలా – క్రిమినల్

#15 ప్రియాంక చోప్రా – తుఫాన్

#16 లీసా రే – టక్కరి దొంగ

#17 ఈషా డియోల్ – యువ (తమిళ్ డబ్బింగ్)

#18 అమృతా రావు – అతిధి

#19 కత్రినా కైఫ్ – మల్లీశ్వరి

#20 అనన్య పాండే – లైగర్

#21 గ్రేసిసింగ్ – సంతోషం

#22 ఊర్మిళ మటోండ్కర్ – అంతం

#23 ఆలియా భట్ – ఆర్ ఆర్ ఆర్





రామాయణం ఇతిహాసంలోని ప్రధాన పాత్రల్లో శూర్పణఖ కూడా ఒకటి. ఆమె లంకాధిపతి రావణాసురుడి చెల్లెలు. శూర్పణఖ రాముడు వనవాసంలో ఉన్న సమయంలో చూసి ఇష్టపడుతుంది. ఆ విషయం గురించి రాముడికి చెబుతుంది. అయితే ఆ సమయంలో లక్ష్మణుడు వచ్చి శూర్పణఖ ముక్కును కొస్తాడు. ఈ క్యారెక్టర్ ను ఆదిపురుష్ సినిమాలో చూపించారు. తేజస్విని పండిట్ శూర్పణఖ క్యారెక్టర్ లో నటించింది.
ఆదిపురుష్ సినిమాలో క్రూరమైన శూర్పణఖగా కనిపించిన తేజస్విని పండిట్ నిజ జీవితంలో ఆమె ఒక స్టార్ హీరోయిన్. మరాఠా సినీ ఇండస్ట్రీలో తేజస్విని పాపులర్ హీరోయిన్. తేజస్విని పండిట్ 2004 లో రిలీజ్ అయిన మారాఠి సినిమా ‘అగా బాయి అరేచా’ తో సినీ కెరీర్ మొదలు పెట్టింది. ఆమె తొలి సినిమాలోనే నెగిటీవ్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. తేజస్విని సినిమాలలోనే కాకుండా టెలివిజన్ ఆడియెన్స్ కూడా ఆకట్టుకుంది.
తేజస్విని బెస్ట్ హీరోయిన్ గా అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులను పొందింది. తేజస్విని తెరపైనే కాకుండా బయట కూడా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. తేజస్విని తన చిన్ననాటి ఫ్రెండ్ భూషణ్ బోప్చేని 2012లో పెళ్లి చేసుకున్నారు. భూషణ్ బిజినెస్ రామేశ్వర్ రూప్‌చంద్ బోప్చే కుమారుడు. తేజస్విని పండిట్ ఇటీవల వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉటుంది. తరచు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
ఆదిపురుష్ మూవీలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నది రావణాసురిడి పాత్ర. ఈ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. రావణాసురుడికి పది తలలు ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రావణాసురుడికి ఉండే పది తలలు ఒకే వరుసలో ఉండకుండా రెండు వరుసలలో ఐదు తలల చొప్పున కనిపిస్తాయి.
ఈ సీన్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్ లేని కాలంలో కూడా పది తలల రావణాసురిడిని చక్కగా చూపించారని, గ్రాఫిక్స్ ను సరిగా వాడలేదని అంటున్నారు. ఇక రెండవ సన్నివేశం ఏమిటంటే, అయోధ్యలో రాముడు తన తండ్రి దశరథునితో మాట్లాడే సన్నివేశం.
ఈ సీన్ లో ప్రభాస్ ఎప్పుడు కనిపించని విధంగా కనిపించాడు. తెల్లటి వస్త్రాల ధరించి, జట్టును వదిలేసి డిఫరెంట్ గా కనిపించారు. ఈ సన్నివేశం పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు. ఈ గెటప్ ట్రైలర్ లో లేదా ఎక్కడ కూడా కనిపించలేదు. డైరెక్ట్ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు ఇంకా నిరాశ చెందారు. కొందరు ప్రభాస్ దశరధుడి పాత్రలో కూడా నటించారని అంటున్నారు. కానీ ప్రభాస్ రాముడి పాత్రలో మాత్రమే నటించాడు.






సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆదిపురుష్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ గురించి చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మూవీకి శాటిలైట్, మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 250 కోట్లు వచ్చాయట. అయితే ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ను మాత్రం అమ్మలేదని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో ముందుగా యువి క్రియేషన్స్ విడుదల చేస్తుందని అనుకున్నా, ఆ తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఓవర్సీస్, ఇతర భాషలకు ఆ రాష్ట్రాలలోని లోకల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా టి సిరీస్ సొంతంగా విడుదల చేయాలని అనుకుంటునట్లు తెలుస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రోజు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ వేడుకకు చినజీయర్ స్వామి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.
















