టాలీవుడ్ హీరోలకున్నంత అభిమానులు మరే పరిశ్రమలోనూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే ఆరడుగుల హైట్ ఉండాలి, వైట్ గా ఉండాలి, హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఒత్తుగా ఉండాలి..ఇలా కొన్ని కొలమానాలు ఉంటాయి. అలాంటి వారిని హీరోలుగా సినీ జనాలు ఆదరిస్తారు వాళ్ళు మెయింటెన్ చేసే స్టైల్ నీ కూడా అభిమానులు ఫాలో అవుతారు.
అందుకే హీరోలు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితం లో కూడా మేకప్ లేకుండా అడుగు బయట పెట్టరు. అలా కాకుండా నిజజీవితంలో చాలా సాదాసీదాగా ఉండే రజనీకాంత్ లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అభిమానులను సంతోష పెట్టడం కోసమే తాను సినిమాల్లో చాలా స్టైలిష్ గా కనిపిస్తానని రజిని చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకే ఆయన బయట చాలా సింపుల్ గా కనిపిస్తారు. రజినీ నిజజీవితంలో ధోతీ, కుర్తా వంటి సాధారణ దుస్తులు ధరిస్తారు. మిగతా ఏ హంగు ఆర్భాటాలకు పోరు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు.

అలాగే ప్రస్తుతం కొందరు హీరోలకు మేకప్ లాగే విగ్ కూడా తప్పని సరి. కొన్ని ప్రత్యేక పాత్రల కోసం నటులు విగ్గులు వాడటం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ప్రస్తుత కాలం లో విగ్గును వాడటం ఎక్కువ అయ్యింది. కొందరు స్టార్ హీరోలకు జుట్టు పలుచబడటం వంటి కారణాల వల్ల విగ్ ను ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా కొందరు నటులు మేకప్, విగ్ లేకుండా బయటకు వెళ్ళరు కూడా. అలాగే ఫాన్స్ కూడా వారిని అలా చూసేందుకే ఇష్టపడతారు. సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ ఇష్టపడినట్టుగా.. నిజ జీవితం లో తమ అభిమాన హీరోలను అలా చూడాలి అనుకోరు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మన ఫేవరేట్ స్టార్ హీరోలు మేకప్ లేకుండా ఎలా ఉంటారో చూద్దాం..
#1 సూర్య

#2 నాని
#3 చిరంజీవి
#4 అల్లు అర్జున్
#5 మహేష్ బాబు
#6 ప్రభాస్

#7 జూనియర్ ఎన్టీఆర్
#8 రామ్ చరణ్
#9 పవన్ కళ్యాణ్
#10 విజయ్
#11 నాగార్జున
#12 విజయ్ దేవరకొండ
#13 రజనీకాంత్

#14 షారుఖ్ ఖాన్
#15 ఆమిర్ ఖాన్

#16 కార్తీ

Also read: తెలుగు పరిశ్రమ హైదరాబాద్ కి రాకముందు… కృష్ణ మాట్లాడిన ఈ స్పీచ్ చూసారా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్ తో పాటు 2 పాటలను కూడా రిలీజ్ చేశారు. వీటికి రెస్పాన్స్ బాగా వచ్చినప్పటికీ, ప్రమోషన్ విషయంలో యూనిట్ పై విమర్శలు వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా సాంగ్స్ ను లిరికల్ గా కాకుండా పూర్తి వీడియోలు రిలీజ్ చేశారు. అంటే మూవీ కంటెంట్ లో చాలా భాగాన్ని రిలీజ్ కు ముందే చూపించినట్లు అయ్యింది.
ఇటీవల రిలీజ్ అయిన ‘రాం సీతా రాం’ సాంగ్ లో రామాయణంలోని ప్రధానమైన దృశ్యం అయిన శ్రీరాముడు సీతాదేవి కలుసుకునే సన్నివేశాన్ని చూపించారు. భావోద్వేగంతో కూడిన ఈ సిన్ ను సాంగ్ లో చూపించి పెద్ద పొరపాటు చేశారని చెప్పవచ్చు. అలాంటి ముఖ్యమైన సన్నివేశాలను ముందే చూపించడం వల్ల మూవీ ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుందో తెలిసిన ఆడియెన్స్ అంతగా ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఇది మూవీ యూనిట్ చేసిన పొరపాటని అంటున్నారు.
ఇక ఈ మూవీని ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడంలో ‘ఆదిపురుష్’ యూనిట్ సాంగ్స్ రూపంలో విజయం సాధించింది. అయితే ఉత్కంఠటను కలిగించే సీన్స్ ముందే చూపించడం వల్ల అసలైన ఫీల్ ను ఆడియెన్స్ మిస్ అయ్యేలా మూవీ యూనిట్ చేసింది. మరి ఇక నుండి ఇచ్చే మూవీ అప్డేట్ ల విషయంలో అయినా చిత్ర యూనిట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ కి సినిమాలు తీయడానికి దాదాపుగా అన్ని విధాల సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి. కానీ ఒకప్పుడు సినిమా తియ్యలి అంటే మద్రాసుకి వెల్లవల్సిందే. అక్కడ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడుతూ తెలుగువారు సినిమాలను చేసేవారు. అయితే ఎందరో చేసిన కృషి వల్ల ఇండస్ట్రీ హైదరాబాద్ కి రాగలిగింది. వారిలో ముఖ్యులు అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, సారధి, రామానాయుడు వంటివారు హైదరాబాద్ లో స్టూడియోలు నిర్మించారు.
1983 జనవరి లో ఎన్టీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాదుకు తీసుకురావడంలో డి.వి.యస్.రాజు కీలక పాత్ర వహించారు. ఆయన సినీ రంగానికి, అభివృద్ధికి కావలసిన అన్నీ సహాయసహకారాలు అందజేశారు. అలా వచ్చిన ఇండస్ట్రీని ఒకప్పుడు పరిగణలోకి తీసుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఉంది. తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం ఇండియాలో అత్యధిక సినిమాలను నిర్మించే ఇండస్ట్రీలలో ఒకటిగా ఉంది.
తాజాగా సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీ హైరాబాద్ కి రాకముందు హీరోలు కృష్ణ, ఏఎన్ఆర్ మాట్లాడిన వీడియో ఒకటి చకకర్లు కొడుతోంది. ఆ వీడియోలో కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకురావాల్సిందిగా కోరారు. మీ హయాంలోనే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నా అంటూ ముగించారు.
ఆ తరువాత ఏఎన్ఆర్ మాట్లాడుతూ 1963 నుండి తెలుగు పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకురావడానికి కృషి జరుగుతోందని, కానీ ఇప్పటివరకు అది జరగలేదని, సీఎం ఎన్టీఆర్ సినీ ప్రపంచం నుండి వచ్చిన వారు కావడం వల్ల ఆయనను తెలుగు ఇండస్ట్రీ హైరాబాద్ కి తరలించాలని కోరడం సమంజసం అని, ఆయన సహకరించాలని అన్నారు.

















సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. ఈ చిత్రంలో మళయాల మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. రిలీజ్ కు ముందు ట్రైలర్, టీజర్ లతో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఏజెంట్, థియేటర్లలో రిలీజ్ అయ్యాక పూర్తిగా నిరాశపర్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ అయిన మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం పెట్టిన బడ్జెట్ లో కనీసం 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది.
ఏజెంట్ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన సోనీ లివ్ కొనుగోలు చేసింది. మే19 నుండి స్ట్రీమింగ్ చేయబోతునట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. కానీ ఆ రోజు స్ట్రీమింగ్ కాలేదు. దాని పై సోనీ లివ్ ” ప్రస్తుతం ఏజెంట్ సినిమా అందుబాటులో లేదని, త్వరలోనే స్ట్రీమింగ్ అవనుంది” అని ట్వీట్ చేసింది. సినీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఏజెంట్ రిలీజ్ కి 2,3 రోజుల ముందు కూడా ఎడిటింగ్ పని జరిగిందట.
మూవీ ఔట్ పుట్ ఎలావుందో సరిగ్గా చూడకుండానే విడుదల చేయడం వల్లే ఫలితం నిరాశపరిచింది. కనీసం ఓటీటీలో అయినా రీ ఎడిట్ చేసి కాస్త బెటర్ ఔట్ పుట్ ను రిలీజ్ చేస్తే మళ్ళీ ట్రోలింగ్ బారిన పడకుండా ఉండే ఛాన్స్ ఉంది. దాంతో ఈ మూవీని రీ ఎడిట్ చేసిన తరువాత ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి మరి.





తన నట ప్రస్థానంలో ఎన్నో చిత్రాలలో అనేక పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ఒక పాత్రను ఎంతగానో ఇష్టపడ్డారు. ఆ పాత్రలో నటించాలని ఎన్నో ఏళ్లు అనుకున్నారు. కానీ ఎన్ని సార్లు ప్రయత్నించిన కానీ ఆ పాత్రను చేయడం మాత్రం వీలుకాలేదు. అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం ఏర్పడేది. అలా ఆయన కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచారు. ఎన్టీఆర్ చేయాలనుకుని, చేయలేకపోయిన ఆ పాత్ర విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు.
అల్లూరి సీతారామరాజు కథతో ఒక చిత్రాన్నినిర్మించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. తోడు దొంగలు అనే చిత్రం తర్వాత ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ అప్పటికే జయసింహ అనే చిత్రాన్ని ప్రకటించడంతో ఎన్టీఆర్ జయసింహ సినిమా తరువాత చేయాలని అనుకున్నారు. ఇక జయసింహ మూవీ పూర్తి అయ్యి రీలజ అవడం విజయం సాధించడం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ సీతారామరాజు పాత్రలో నటించే చిత్రం ప్రారంభం అయినా వేరే కారణాలతో ఆ చిత్రం ఆగిపోయింది.
అయితే పాండు రంగ మహత్మ్యం మూవీ తర్వాత ఈ చిత్రంలో నటించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఆ టైం లో అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ లో కథానాయకకు చోటు లేకపోవడంతో పడాల రామారావు కథను మార్చాలని ఎన్టీఆర్ ను అడిగారు. ఇక ఆ తర్వాత శోభన్ బాబుతో అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తీయాలని ఒక సంస్థ అనుకున్న ఆర్థిక సమస్యల వల్ల ఆ మూవీ వెనక్కు తగ్గింది.
అయితే అదే స్టోరీని సూపర్ స్టార్ కృష్ణ తీసుకోవడం, ఆ కథకు త్రిపురనేని మహారథి కొన్ని మెరుగులు దిద్దడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో అల్లూరి సీతారామరాజు 100వ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రం కృష్ణ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచింది. అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఎన్టీఆర్ కృష్ణ నటించిన ఈ చిత్రాన్ని చూసిన తరువాత అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని అనుకోలేదు. ఇక అల్లూరి సీతారామరాజు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటనను ఎన్టీఆర్ ప్రశంసించారు. అయితే అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించనప్పటికీ, ఎన్టీఆర్ అల్లూరి పాత్రలో కొన్ని చిత్రాలలో కనిపించారు.

