కొన్ని సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చూసినప్పుడు అబ్బా చాలా బాగా రాసారు, హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది అనిపిస్తుంది. ఆ పాత్రలు కొన్నాళ్ళు మనల్ని వెంటాడతాయి. ఉదాహరణకి బొమ్మరిల్లు లో హాసిని, ఫిదా లో భానుమతి పాత్రల లాగ.
అదే మరి కొన్ని సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్, కొంచెం విచిత్రంగా, సిల్లీగా ఉంటుంది. అసలు ఆ పాత్రలకు ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ అవ్వలేరు. మరి తప్పు ఇది రాసిన రైటర్స్ దా.. లేక చేసిన ఆర్టిస్టుల దా అనే విషయం పక్కన పెడితే ఆ పాత్రల వల్ల కొన్ని సార్లు సినిమా ఫలితమే మారిపోయింది కొన్నిసార్లు. ఇప్పుడు ఆ పాత్రలు ఏంటో చూద్దాం..
#1 జెనీలియా – ఆరంజ్

భాస్కర్ గారి బొమ్మరిల్లులో హాసిని పాత్ర ఎంత బాగుంటుందో…ఈ సినిమా లో అంత చెత్తగా ఉంది. మెయిన్ గా బ్రహ్మానందం గారితో వచ్చే సీన్స్ అయితే అస్సలు బాగోవు.
#2 రష్మిక- పుష్ప

నేషనల్ క్రష్ అయినా రష్మిక పుష్ప తో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. కానీ ఈ మూవీ లో ఆమె సీన్లు పేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి.
#3 మెహ్రీన్ – ఎఫ్ 2

అనిల్ రావి పూడి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది గాని.. అందులో మెహ్రీన్ చేసిన హనీ పాత్రను అస్సలు భరించలేం.
#4 పూజ హెగ్డే- మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్

అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం లో పూజ హెగ్డే పాత్ర చాలా డామినేటింగ్ గా ఉండటం తో పాటు కాస్త అతి ఎక్కువైనట్లు ఉంటుంది.
#5 రష్మిక – సరిలేరు నీకెవ్వరూ

అనిల్ రావిపూడి మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది కానీ ఇందులో రష్మిక ఐ ఆమ్ ఇంప్రెస్స్డ్ అంటూ చేసే అల్లరి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేదు.
#6 కేతిక శర్మ- రొమాంటిక్

పూరి తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం తో కేతిక టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇందులో కేతిక యాక్షన్ అస్సలు భరించలేకపోయారు జనాలు.
#7 రాశి ఖన్నా – పక్కా కమర్షియల్

గోపీచంద్ , రాసి ఖన్నా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం లో రాశిఖన్నా పాత్ర అంత ఇంప్రెసివ్ గా ఉండదు.
#8 కీర్తి సురేష్ – రంగ్ దే

ఈ సినిమాలో ఈ పాత్ర అసలు కీర్తికి సెట్ అవ్వలేదు అలాగే ప్రేక్షకులు కూడా ఈ పాత్రకి కనెక్ట్ అవ్వలేకపోయారు.
#9 అనన్య పాండే – లైగర్

అసలు పూరి సినిమాల్లో హీరోయిన్ లు డిఫరెంట్ గా .. కంప్లీట్ ఆటిట్యూడ్ తో ఉంటారు. అది కొన్ని సార్లు వర్క్ అవుట్ అయినా .. కొన్ని సార్లు తేడా కొట్టేస్తుంది. లైగర్ సినిమాలో అనన్య పాత్ర కూడా అంతే.
#10 రాశి ఖన్నా – వరల్డ్ ఫేమస్ లవర్

విజయ్ దేవరకొండ తో రాశి ఖన్నా చేసిన ఈ చిత్రం ప్లాప్ ఐయ్యింది. ఇందులో రాశి పాత్ర చాలా డల్ గా సాగుతూ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.






























































యశోద ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మయోసైటిస్‌తో అనే దీర్ఘకాలిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత ఈ సినిమాలో ఫైట్స్ చేసింది. సమంత చేసిన కొన్ని స్టంట్స్ అందర్నీ ఆశ్చర్యపర్చాయి. థియేటర్ల నుండి వెళ్లిపోయిన యశోద సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇటీవల ఈ మూవీ పై ఇవా హాస్పటల్ పరువు నష్టం దావా వేసింది. ఈ మూవీ పై ఈవా పేరుతో ఉన్న సరోగసీ సెంటర్లో నేరం చేసినట్లుగా చూపించారని, ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ ఆపేయాలని ఇవా హాస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
అయితే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో విడుదల చేసే వెర్షన్లో హాస్పటల్ బ్లర్ చేస్తామని చెప్పారు. దీంతో ఓటీటీ రిలీజ్‌కి అడ్డంకి తొలిగింది. డిసెంబరు 9న స్ట్రీమింగ్ అవబోతునట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్లాప్ సినిమాలనే త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.కానీ యశోద సినిమా హిట్ అయ్యింది. అయిన కూడా ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరో నాని అర్జున్ సర్కార్ అనే పేరుగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని, సినిమా పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తామని చెప్పారు. ఇదివరకే దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్ ని ఎవెంజర్స్ మాదిరిగా చేస్తామని స్పష్టం చేశాడు. అంటే ఎవెంజర్స్ మూవీస్ లో ఒకేదానిలో ఇద్దరు ముగ్గురు హీరోస్ ఉంటారో, అలాగే హిట్ రాబోయే సిరీసుల్లో కూడా ఒకరు కంటే ఎక్కువ హీరోలు కనిపిస్తారని చెప్పారు. మరో విధంగా చెప్పాలంటే మల్టీస్టారర్ మూవీ అనవచ్చు.
ఇక హిట్-3లో నాచురల్ స్టార్ నానినే హీరో అనే విషయం తెలిసిందే. హిట్-2 సినిమా క్లైమాక్స్ లో ఆ విషయాన్ని చూపించారు. హీరో నానిని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా ఇంట్రడ్యూస్ చేసారు. దీని ప్రకారం హిట్-3లో నానినే హీరో. అయితే తాజాగా శైలేష్ కొలను పెట్టిన పోస్ట్ తో నానితో పాటు అడివి శేష్, విశ్వక్ సేన్ లు ఈ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది.
ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట. ఈసారి పక్కా ప్లాన్స్ బరిలోకి దిగారని సమాచారం. డిసెంబరు 8న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కానుంది.
దీనికోసం మూవీ యూనిట్ ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక అక్కడి నుండి వచ్చాక పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఒక్కసారి సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆగకుండా పూర్తి చేస్తారట.ఈ సినిమాలో పాట నటులతో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్. అంటే మొదటి పార్టులో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిలో విలన్లను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.




