సోషల్ మీడియాలో సెలెబ్రిటీల ఫోటోలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఒకసారి సెలబ్రిటీ అయిపోయాక వారి పర్సనల్ లైఫ్ పై ఎక్కడలేని ఫోకస్ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో వారి చిన్న నాటి ఫోటోలు కూడా ఓ రేంజ్ లో వైరల్ అయిపోతూ ఉంటాయి. సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ ను తెలుసుకోవాలన్న కుతూహలం అభిమానులలో కూడా ఉంటుంది. తాజాగా ఈ ఫోటో వైరల్ అవుతోంది.
ఈ కింద ఫొటోలో ఉన్న కాలేజీ స్టూడెంట్స్ లో ఓ సెలెబ్రిటీ ఉన్నారు. ఎవరో గుర్తుపట్టారా..? సరిగ్గా గమనించి చూడండి. లెఫ్ట్ సైడ్ చివరగా ఉన్న అమ్మాయిని చూసారా..? ఆ అమ్మాయి మరెవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ప్రస్తుతం సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన తన తొలి ఓటిటి చిత్రం కోసం కాలింపాంగ్లో షూటింగ్ లో పాల్గొంటున్నారు. 41 ఏళ్ల ఆమె కాలింపాంగ్కు వచ్చినప్పటి నుండి సెట్స్ నుండి తన మెమోరీస్ ను పంచుకుంటోంది. ‘జబ్ వుయ్ మెట్’ స్టార్ యొక్క కాలింపాంగ్ను ఇటీవల సందర్శించడంతో ఆమెకు తన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.
తన పాఠశాల రోజులను గుర్తు చేసుకుంటూ ఆమె ఫోటోలను పంచుకుంటున్నారు. గురువారం నాడు, కరీనా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి వెళ్లి, 1996 రాజస్థాన్ పాఠశాల పర్యటనలో ఆమె వెల్హామ్ గర్ల్స్ స్కూల్ లో ఉన్న సమయంలో తన స్నేహితులతో తీసుకున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది.






































మరి ఎందుకు కనిపించడం లేదు అనే డౌట్ చాలామందిలో ఇప్పటికి ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని ఆలీ గారే ప్రస్తావిస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమస్య చాలా మంది సీనియర్ నటులు అనుభవిస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ దీనిపై ఆయన ఏమన్నారంటే.. ఈ మధ్య చిన్న చిన్న సినిమాల్లో నాకు పాత్రలు ఇస్తున్నారు.పాత్ర చాలా బాగుంటుంది అని చెబుతూ.. కథ ఏంటో కూడా చెప్పకుండా డేట్స్ తీసుకుంటున్నారు. తీరా సినిమా విడుదలై థియేటర్ లోకి వచ్చాక అసలు ఆలీ ఈ సినిమాలో ఎందుకు నటించాడు అనేలా మూవీస్ ఉన్నాయి.
అభిమానులతో అలా అనిపించుకోవద్దనే చాలా సినిమాలు వస్తున్నా కథ నచ్చితేనే ఓకే చెబుతున్నానని అన్నారు. ఈటీవీ సీరియల్ లో నటించడం గురించి కూడా ఆయన మాట్లాడారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కోసం యమలీల సీరియల్ చేస్తున్నానని అన్నారు.
స్టార్ దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన నన్ను హీరోను చేశాడని, ఆయన ఏది చెప్పినా వెనకాడకుండా ఆలోచించకుండా చేస్తానని అన్నాడు ఆలీ. అందుకోసమే ఇప్పుడు యమలీల సీరియల్ చేశానని వివరించాడు. దీంతో పాటు ఇతర భాషల్లో సినీ అవకాశాల గురించి కూడా ఆలీ చెప్పుకొచ్చారు.
తెలుగులోనే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలో నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. మొన్న ఈ మధ్య కాలంలోనే నేపాలి సినిమాకు కూడా సంతకం చేశారట. ఒకప్పుడు మన తెలుగులో ఉత్తరాది వాళ్లని తీసుకువచ్చి నటన, భాషను నేర్పించి మరి దర్శకనిర్మాతలు డబ్బులు ఇచ్చేవారు.
కానీ ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీ వాళ్లే మనల్ని సంప్రదిస్తున్నారు. ఎందుకంటే మేం ఇండియన్ స్టార్స్ గా మారిపోయామంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు అలీ. అయితే నేపాల్ సినిమా వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఇలా వారు టీవీ చూస్తున్నప్పుడు తండ్రి దగ్గుతూ ఉండగా పక్కనే ఉన్న కూతురు తన తండ్రి వైపు అమాయకంగా చూస్తూ ఉండడం మనం సినిమా చూసినప్పుడల్లా చూస్తాం. ఆ చిన్న పాప ఒక్క చూపుతో ఆ తండ్రి సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని భావించి అవి మానేస్తాడు. ఆ చిన్న పాప ఇప్పుడు పెద్ద పాప అయిపోయింది. ప్రస్తుతం సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీ జీవితాన్ని గడుపుతోంది.
ఈ చిన్న పాప పేరు “సిమ్రాన్ నటేకర్” ముంబైలోని పుట్టి పెరిగింది. ప్రస్తుతం మోడలింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సిమ్రాన్ తల్లిదండ్రులు కూడా సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో నో స్మోకింగ్ అనే ప్రకటనలో నటించాల్సి వచ్చింది. ఈ ప్రకటన తర్వాత ఆ పాప 150 పైగా యాడ్స్ లో నటించడం విశేషం. ముంబైలో నో స్మోకింగ్ అవేర్నెస్ యాడ్ కు సంబంధించి ఈ పాప ఫోటోలు ఇప్పటికి కనిపిస్తూ ఉంటాయి. ఈ యాడ్ ద్వారా అందరి మన్ననలు పొందిన ఈ అమ్మాయి ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్లో ఉంది.
అలాగే చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో పూజ పాత్ర చేసింది కూడా ఈ అమ్మాయి. అలాగే ఈ అమ్మడు “జానే కహా సే ఆయు హై” అనే మూవీలో కూడా నటించింది. ఇప్పటికీ తన నటనకు సంబంధించి సరైన గుర్తింపు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతోంది. అంతే కాకుండా చాలా వరకు హిందీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య కాలంలో సిమ్రాన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారింది. అప్పుడప్పుడు అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

