మహేష్ బాబు సినిమాలు అంటేనే ఎప్పుడు సక్సెస్ అనే బ్రాండ్ ఆయనకు ఉంది. ఆయన సినీ జీవితంలో డిజాస్టర్ అయినా మూవీ బ్రహ్మోత్సవం మాత్రమే.. ఆ సినిమా సీరియల్ ను తలపిస్తుంది అని నెటిజన్ల నుండి కామెంట్లు వచ్చాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన సర్కారు వారి పాట సినిమా రెండవ భాగం కూడా బ్రహ్మోత్సవం సినిమా లాగానే ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
దీంతో మహేష్ అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది అని చెప్పవచ్చు. ఆయన అభిమానులు ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన నుండి వచ్చిన ఈ సినిమా ఈ విధంగా నిరాశ పరచడం అభిమానులను బాధిస్తోందని అంటున్నారు.. మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూడడానికి వెళ్తే ఏ మాత్రం ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ అంటున్నారు.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మంచి అవకాశం ఇస్తే దర్శకుడు పరశురామ్ ఉపయోగించుకో లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కథల విషయంలో ఆచితూచి అడుగు వేసే మహేష్ బాబు ఈ సర్కారు వారి పాట సినిమా ఓకే చేసి తప్పు చేశాడని మరి కొందరు భావిస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు సైతం అంచనాలకు మించి నష్టాలు మిగులుతాయనే సంగతి తెలిసిందే..
అయితే ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్ లను కలవరపెడుతోంది. అయితే సినిమా థియేటర్లో రిలీజ్ అయి వారం రోజులకే ఓటీటీ లోకి అందుబాటులోకి రావడంతో చాలా మంది థియేటర్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అని ఆయా హీరోల ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.

ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమా యొక్క టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులను ఆనందపరిచారు. ఇందులో ఇంతకుముందు రామ్ ను ఎప్పుడు చూడని విధంగా ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు.
ఇందులో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ” మై డియర్ గ్యాంగ్ స్టర్స్ వీలైతే మారిపోండి “.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ ” అనే డైలాగ్ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఈ మూవీని తెలుగు మరియు తమిళ భాషలలో రూపొందించనున్నారు డైరెక్టర్.
ఈ సినిమాలో అక్షర గౌడ కూడా ఒక కీలక పాత్రలో నటించనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 14వ తేదీన చాలా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఇక ఈ మూవీ తర్వాత రామ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారని సమాచారం.
సినిమా ఫెయిల్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో మహేష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలా చేయడానికి ప్రధాన కారణం మహేష్ బాబు అభిమానులే అని చెప్పవచ్చు. అయితే సాధారణంగా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది.
ఈ వార్ మెగా అభిమానులకు మరియు మహేష్ అభిమానులకు మధ్య చోటు చేసుకోవడం వల్ల సినిమాపై ప్రభావం పడింది. ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది మహేష్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం చేశారు. దాన్ని మనసులో పెట్టుకుని మెగా అభిమానులు ఊరుకుంటారా.. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా పై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు.
దీంతో అభిమానుల మధ్య వచ్చిన వార్ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చిందని చెప్పవచ్చు. అయితే మహేష్ అభిమానులు సినిమా నెగిటివ్ రివ్యూ అనేది తప్పుడు ప్రచారం అని సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఇలాంటి తప్పుడు రివ్యూలు చూసి నమ్మకండి అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నారు.
























