నమ్రత శిరోద్కర్…ఒకప్పటి మిస్ ఇండియా. తెలుగులో రెండే రెండు చిత్రాల్లో నటించి 2005 లో మహేష్ బాబును పెళ్లి చేసుకున్నారు. నమ్రత మహేష్ కాంబినేషన్ లో వచ్చిన వంశీ చిత్రం తో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లి కి దారి తీసింది. వీళ్లిద్దరి జోడి చూడ ముచ్చటగా ఉంటుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను ఆశించిన ప్రేక్షకుల కోరిక ఇక తీరేటట్లు లేదు. కానీ మహేష్ ప్రతి అడుగు వెనుక నమ్రత బలమైన సపోర్ట్ ఉంటుందన్న విషయం ఇండస్ట్రీ మొత్తం తెలిసిందే.
మహేష్ లాగే పబ్లిక్ లైఫ్ లో పెద్దగా కనిపించని నమ్రత ప్రవర్తనలో ఈ మధ్య కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ విషయం లో నమ్రత మెగా కోడలు ఉపాసనను ఫాలో అయినట్లు కనిపిస్తుంది. ఉపాసన తనకు సమయం దొరికినప్పుడల్లా చరణ్ సినిమాను ప్రేక్షకుల మధ్య చూస్తూ సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా లో పంచుకుంటుంది. ఈ మధ్యనే విడుదలైన మహేష్ సినిమా సర్కారు వారి పాట ను ప్రేక్షకుల మధ్య సింగల్ స్క్రీన్ థియేటర్ లో చూసిన నమ్రత థియేటర్ లో సినిమా చూసే విషయంలో మెగా కోడలు ఉపాసనను ఫాలో అయినట్లు కనిపించింది. సర్కారు వారి పాట మూవీని ప్రేక్షకుల మధ్య చూసిన నమ్రత మహేష్ ఫ్యాన్స్ నుంచి సినిమా గురించి రెస్పాన్స్ ను కూడా తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నం చేశారు.

Namrata
ఇక ఈ మధ్యనే విడుదలైన సర్కారు వారి పాట మొదటి షో నుండే డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాకు ఈ విధంగా ప్రమోషన్స్ చేయడం ద్వారా సినిమాకు ప్లస్ అవుతుందని ఆమె భావించి ఉండొచ్చు. మహేష్ మూవీ కోసం నమ్రత పడుతున్న కష్టాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.

ఇక మహేష్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో సెట్ అయ్యింది. ప్రస్తుతం హాలిడే లో ఉన్న మహేష్ అండ్ ఫామిలీ హాలిడే నుంచి వచ్చాక జూన్ నుండి మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

మహేష్ బాబు వరుస హ్యాట్రిక్స్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. థియేటర్ లోకి వచ్చిన మొదటి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో తాజా కర్నూలు జిల్లాలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు నాకు అభినవ సంబంధాలు ఉన్నాయని, ఒక్కడు మూవీ చూసిన తర్వాత నేను దర్శకుణ్ణి అవ్వాలని భావించి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను అని నేను ఎంతగానో ఇష్టపడే సూపర్ స్టార్ తో సినిమా చేయడం, ఇక్కడికి రావడం నా లైఫ్ టైం బహుమతి అని అన్నారు.
కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏలుతుంది మాత్రం మొత్తం స్టార్ హీరోల వారసులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యామిలీ లా నుండే హీరోలు పరిచయం అవుతుండటం చూస్తున్నాం. ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ నే కాకుండా తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
ఇలా చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వారి యొక్క పిల్లలను చిన్నప్పట్నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసి చక్కగా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత కాలంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్నచిన్న సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మెల్లమెల్లగా స్టార్డమ్ సంపాదిస్తున్న హీరోలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టు అందుకుంటూ సినీ వారసత్వం ఉన్నవారిని కూడా డీలా చేస్తూ దూసుకుపోతున్నారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన డీజే టిల్లు సినిమా బంపర్ హిట్ సాధించింది. దీని తర్వాత తాజాగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ విజయాన్ని అందుకుంది. ఇక నిర్మాతలు కూడా ఈ కుర్ర హీరోలతో సినిమాలు తీయడం కోసం ముందుకు వస్తున్నారు.
స్టార్ హీరోల వైపు వారి చూపులు మళ్ళీస్తూ కుర్ర హీరోల వైపే మొగ్గుచూపుతున్నారు. చిన్న హీరోలతో సినిమా చేస్తే ప్లాప్ అయినా సరే పెద్దగా నష్టం ఉండదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.






















#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18


