ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు అందరిలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటూ ఇప్పటికీ.. ఎప్పటికీ చెరగని అందంతో ఆకర్షించే నటుడు మహేష్ బాబు. 47 సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా తన లుక్స్ ని మెయింటైన్ చేయడమే కాకుండా అద్భుతమైన ఫిట్నెస్ కు మహేష్ ప్రసిద్ధి. ఇతను తన బాడీ మెయింటైన్ చేయడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు మంచి పోషకాలు ఉన్న భోజనం చేస్తాడు.
మహేష్ డైట్ ప్లాన్ మరియు ఫిట్నెస్ సీక్రెట్స్ ఎంతో క్రేజ్ సంతరించుకున్నాయి. మరి ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి డైట్ తీసుకుంటారో, హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో తెలుసుకుందాం.
ఎప్పుడు కూడా మహేష్ ఒకేసారి ఎక్కువగా తినడాన్ని ఇష్టపడరు అందుకే రోజుకు అయిదు ఆరు సార్లు మితమైన భోజనాన్ని తీసుకుంటారు. రోజు తన వర్క్ అవుట్ తర్వాత ప్రోటీన్ షేక్స్ మరియు సప్లిమెంట్స్ తప్పనిసరి. మహేష్ బాబు ఎప్పుడూ తన భోజనంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు గుడ్ ఫాట్స్ ఉండేలా చూసుకుంటారు.
సాధారణంగా ఆయన తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఎగ్ ,ఓట్ మీల్ లేదా ఫ్రూట్స్ ని బాగా ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం సమయంలో కచ్చితంగా రైస్ ఐటమ్స్ తినడం ద్వారా మహేష్ సరియైన కార్బోహైడ్రేట్ బాడీకి అందేలా చూస్తారు. దీనితోపాటుగా చికెన్ ,ఎగ్ లేదా ఫిష్ వంటివి అతని రోజువారి భోజనంలో భాగంగా ఉంటాయి.
స్నాక్స్ కోసం అతను తీసుకునేది మాక్సిమం మిక్స్డ్ నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ వంటివే ఉంటాయి. మహేష్ కు ఎక్కువగా తాజా పండ్లు మరి ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం బాగా ఇష్టమట. అలాగే ఎక్కువగా బచ్చలకూర మరియు బ్రోకలీ వంటి తాజా ఆకుకూరలను తన డైట్ లో భాగంగా చేసుకుంటారు. వీలైనంత ఎక్ససైజ్ చేస్తూ మంచి ఆహారపు అలవాట్లు ఫాలో అవుతూ అతను ఎప్పుడూ ఆరోగ్యంగా ,ఫిట్ గా ఉంటాడు. మహేష్ జంక్ ఫుడ్ మరియు డైరీ ప్రొడక్ట్స్ అస్సలు ముట్టుకోడు. మరి ఇంత క్లీన్ డైట్ ను మీరు కూడా ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి…