ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.
కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అలా మన భాషలో కూడా చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి. అందులో ఒక సినిమా అయితే తెలిసి తెలియకుండానే మూడు సార్లు రీమేక్ అయింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా కంత్రి. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరో తన తల్లితండ్రులని చంపిన అతనిపై పగ ఎలా తీర్చుకుంటాడు అనే పాయింట్ మీద సినిమా అంత నడుస్తుంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. తర్వాత కొన్నాళ్లకి వచ్చిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా స్టోరీ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఈ సినిమా రిజల్ట్ కూడా ఆశించిన విధంగా రాలేదు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సాహో. సాహో సినిమా స్టోరీ కూడా ఇదే.
అలా అనుకోకుండా ఈ మూడు సినిమాలు ఒకే కాన్సెప్ట్ మీద వచ్చాయి. ఈ మూడు సినిమాల్లో తెలియకుండా ఉన్న ఈ కామన్ పాయింట్ లార్గో వించ్ అనే ఒక సినిమాకి దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మూడు సినిమాలు కూడా అంత మంచి ఫలితం పొందలేదు. వీటిలో సాహోకి కలెక్షన్స్ వచ్చినా కూడా టాక్ మాత్రం మొదట్లో అంత పాజిటివ్ గా రాలేదు. అలా ఈ మూడు సినిమాలు తెలియకుండా ఒకే సినిమా నుండి ఇన్స్పైర్ అయి అయ్యి తీశారు.