ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.
ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. సినిమా బృందం అంతా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది. సినిమా సెన్సార్ కట్ ఇటీవలే పూర్తయింది. సినిమా నిడివి మూడు గంటల ఆరు నిమిషాలు ఉంది. ఇందులో నాలుగు నిమిషాలు కట్ చేసినట్టు సమాచారం. అందులో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక సీన్ కట్ అయ్యింది. కొమరం భీమ్ పాత్ర గొప్పతనం గురించి చెప్పే ఈ సీన్ సెన్సార్ కట్ లో తొలగించారు. అంతే కాకుండా థాంక్స్ కార్డ్ లో కూడా 20 సెకన్లు కట్ చేశారు. కానీ ఆ కొమరం భీమ్ సీన్ ఉంచితే బాగుండేది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.