ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా సినిమాలు వచ్చాయి. అయితే, సినిమాల కంటే ముందే ఆ సినిమాలకు సంబంధించిన పాటలు విడుదలయ్యాయి. అందులో కొన్ని పాటలు హిట్ అవ్వడంతో పాటు, వివాదాలు కూడా సృష్టించాయి.
పాటలో కొన్ని పదాలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, పాట భావం సరిగ్గా లేదని, ట్యూన్ కాపీ కొట్టారని, ఇలా కొన్ని పాటల మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అలా వివాదాలకి దారి తీసిన కొన్ని పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 సారంగ దరియా
ఈ పాట ఎంత హిట్ అయ్యిందో అనే వివాదాలు కూడా అయ్యాయి. పాట రాసిన రచయిత సుద్దాల అశోక్ తేజ, అసలు జానపద పాటకి క్రెడిట్ ఇవ్వలేదు అని కామెంట్స్ వచ్చాయి. తర్వాత సినిమా బృందం స్పందించి వివాదాలని పరిష్కరించుకున్నారు.
#2 ఇప్పుడు కాక ఇంకెప్పుడు
ఈ సినిమాలో భజగోవిందం పాటని తప్పుగా చిత్రీకరించారు అని చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
#3 దిగు దిగు నాగ
వరుడు కావలెను సినిమా కోసం రాసిన ఈ పాటపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భక్తి పాటని ఇలా చేసారు అని రచయిత అనంత శ్రీరామ్ పై కేస్ పెట్టారు.
#4 ఊ అంటావా ఊ ఊ అంటావా
పుష్ప సినిమాలో ఈ పాట మగవాళ్లని కించపరిచేలా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
#5 మైసమ్మ పాట
మంగ్లీ పాడిన ఈ పాటలో కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ, ఆ పదాలని తొలగించాలి అంటూ హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
ఈ సంవత్సరం వివాదంలో చిక్కుకున్న కొన్ని పాటలు ఇవే.