“హీరోని చూసి జనాలు వస్తారు… వాళ్ల రెమ్యూనరేషన్ తగ్గదు..!” అంటూ… టికెట్ ధరల విషయంపై RGV కామెంట్స్..!

“హీరోని చూసి జనాలు వస్తారు… వాళ్ల రెమ్యూనరేషన్ తగ్గదు..!” అంటూ… టికెట్ ధరల విషయంపై RGV కామెంట్స్..!

by Mohana Priya

Ads

ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ టికెట్ ధరల విషయంపై చాలా మంది ప్రముఖులు స్పందించారు. నాని, సిద్ధార్థ్, నిఖిల్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై మాట్లాడారు.

Video Advertisement

“టికెట్ రేట్స్ తగ్గించడం మూలాన రెమ్యూనరేషన్ తగ్గటం అనేది జరగదు. ప్రొడ్యూసర్ రెవెన్యూ తక్కువ వస్తోంది అంటే సినిమాకి పని చేసే వాళ్ళకి తగ్గిస్తారు. హీరోకి ఎవరు డబ్బులు తగ్గించలేరు. ఎందుకంటే హీరోని చూసి జనాలు సినిమాకి వస్తారు. వాళ్లు పొదుపు అంతా వేరే చోట్ల చేస్తారు కానీ హీరో దగ్గర చేయరు.”

ram gopal varma about ticket rates issue in andhra pradesh

“ఎందుకంటే హీరో లేకపోతే ఈ సినిమానే లేదు. నాచురల్ ప్రాసెస్ లో రెమ్యునరేషన్ అటు ఇటు అవుతుంది కానీ ఇది మాక్సిమం ఎఫెక్ట్ చేసేది క్రూ మెంబర్స్ కి. హీరోకి కాదు. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్, కెమెరామెన్, క్రూ మెంబెర్స్ వీళ్ళకి కట్ అవుతాయి. హీరోకి కట్ అయినా ఏమి తేడా ఉంటుంది. ఆల్రెడీ హీరోది కింగ్ స్టైల్ జీవితం. నెలనెలా వచ్చే జీతాల మీద ఆధారపడే వాళ్ళకి మాక్సిమం ఎఫెక్ట్ పడుతుంది.”

“ఎందుకంటే ప్రొడ్యూసర్ రెవెన్యూ లేదు కాబట్టి వాళ్లకు జీతం తగ్గిస్తాడు. అసలు దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. కామన్ సెన్స్ ఉన్న ఎవరికి అయినా ఇది తెలుస్తుంది. నేను పాలిటిక్స్ ఎక్కువ ఫాలో అవ్వను.  మన దగ్గర తిప్పి తిప్పి కొడితే వందమంది కంటే ఎక్కువ స్టార్ డైరెక్టర్స్, హీరోస్ లేరు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోస్ కి ఎప్పుడు వచ్చే రెమ్యూనరేషన్ కంటే ఒక పది కోట్లు తక్కువ వస్తే ఏం తేడా పడుతుంది. ఈ విషయం వల్ల ప్రభుత్వం కూడా నష్టపోతుంది. రెవెన్యూ ఎంత తగ్గిస్తూ ఉంటే ఆదాయం కూడా అంతే తగ్గుతుంది. టాక్స్ రేట్ కూడా తగ్గుతుంది. అందరూ నష్టపోతారు. అసలు వాళ్ల ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు” అని అన్నారు.

watch video : 

 


End of Article

You may also like