కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా శాండిల్వుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటించి పాపులర్ అయింది రష్మిక. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో నటించి అలరించింది.
తాజాగా.. రష్మిక తన ఇన్స్టా లో ఓ ఫోటోను పంచుకున్నారు. ఆమె తన చేతిని ఫోటో తీసి షేర్ చేసారు.
ఆ చేతిపై అక్కడక్కడా గాయాలు అయ్యి ఉన్నాయి. ఆ ఫోటో కు కాప్షన్ జత చేసి అసలు విషయం చెప్పారు. “కేవలం స్టార్ డమ్, డబ్బు ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్న కోణంలోనే సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తున్నారా..? అదంతా కరెక్ట్ కానీ.. అన్ని అద్భుతాలు మాత్రమే కాదు.. ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు. తానూ ఎన్నో సార్లు లేజర్ చేయించుకోవాల్సి వచ్చిందని.. అది ఎంత పెయిన్ గా ఉంటుందో మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. ఆ లేజర్ వల్లే చేతికి ఈ గాయాలయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు.




ఈ నేపథ్యంలో రాజమౌళి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, “అసలు సంక్రాంతి రిలీజ్ సినిమాలు వాయిదా వేయడం అనే విషయం మొదలు పెట్టింది మహేష్. దీనివల్ల ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంది. నా హీరోకి థ్యాంక్స్” అని చెప్పి ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కి, ఎఫ్ 3 సినిమా బృందానికి కూడా థ్యాంక్స్ చెప్పారు.











