సినిమా హీరోయిన్ అర్చన స్టార్ హీరోయిన్ కానప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించి అందంతో పాటు తనలో టాలెంట్ కూడా ఉందని నిరూపించుకున్న నటి అర్చన. కానీ ఎందుకో ఆమెకి స్టార్ స్టేటస్ దక్కలేదు. తపన అనే సినిమాతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయింది అర్చన. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, సామాన్యుడు, శ్రీరామరాజ్యం వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకుంది.

అలాగే బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు మరింత ప్రయత్నించింది. కానీ ఎందుకో బిగ్ బాస్ కూడా ఆమెకి పెద్దగా ఫేం ని తీసుకురాలేకపోయింది. అయితే తాజాగా నటి అర్చన ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. నిజానికి నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాలో అర్చనది హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్ర. లల్లీ అంటూ సిద్ధార్థ తనని ఏడిపించడం ద్వారా సినిమాలో బాగా హైలైట్ అయింది.

image credits: sri balaji video
అయితే అదే సినిమా తన కెరీర్ క్లోజ్ అయిపోవటానికి కారణం అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది అర్చన. ఆ సినిమాలో ఫ్రెండ్ రోల్ లో చేయడం వలన మరెవరూ హీరోయిన్ పాత్ర ఇవ్వలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో తన పాత్రకి కళ్ళజోడు పెట్టడం మరీ మైనస్ అయింది. ఏ నటికైనా హావభావాలు పలికించాలంటే కళ్ళు ముఖ్యం అలాంటిది కళ్ళజోడు పెట్టుకోవడం వలన హావభావాలు సరిగ్గా కనిపించలేదని చెప్పుకొచ్చింది.

image credits: sri balaji video
అంతే కాకుండా అంతకుముందు హీరోయిన్ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కూడా ఆ ఛాన్స్ ని వెనక్కి తీసుకున్నారు. ఆ సినిమా ఎంతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాని మిస్ అయినందుకు ఇప్పటికే బాధపడుతూ ఉంటాను. ఒక్క నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాచేయకపోయి ఉంటే నా కెరియర్ మరొక లాగా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది అర్చన.

కళాతపస్వి కె విశ్వనాధ్ మూవీ అంటేనే, దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో సంగీత, నృత్య, సాహిత్య, కళాత్మక విలువల గురించి అద్భుతంగా చూపిస్తుంటారు. అదేకోవలో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్వర్ణ కమలం. ఈ మూవీ అప్పట్లో బంపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్, భానుప్రియ జంటగా నటించగా కీలక పాత్రలలో చాలామంది నటీనటులు కనిపించారు.
కళ అనేది జన్మ జన్మల పుణ్యం వల్లే వస్తుందని గ్రహించలేని వేదపండితుడి కూతురు కథే ఈ మూవీ. సమాజం వేగంగా మారుతోంది. దానితో పాటే మనమూ వెళ్లాలి. సంప్రదాయ కళలనే నమ్ముకుని బావిలో కప్పల బతకడం ఏమిటి అనుకునే మీనాక్షి పాత్రలో భానుప్రియ అద్భుతంగా నటించింది. మూవీ ప్రారంభంలో తండ్రి నేర్పించిన కూచిపూడి నాట్యం కడుపు నింపదనే భావనతో అయిష్టత ప్రదర్శస్తుంటుంది. ఆ సమయంలో ఆమె తయారయ్యే విధానం కూడా గందరగోళంగా ఉంటుంది.
కానీ ఆమెలో మార్పు వచ్చిన తరువాత ఆమె తయారయ్యే విధానంలో మార్పును చూపిస్తూ, దర్శకుడు ఆ విషయాన్ని స్పష్టంగా ఆ సన్నివేశంలో చూపించారు. అప్పటి ప్రేక్షకులు ఈ విషయాన్ని ఎంతవరకు గ్రహించారో లేదో కానీ, ఒక మూవీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించారు. ఆ ఇంటర్వ్యూ కు ఈ రెండు సీన్స్ ను కలిపి చందమామ కథలు అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేస్తూ, అసలు పాత సినిమాలలోనే చాలా కొత్త విషయాలు ఉన్నాయి. కానీ మనం గ్రహించలేదు అంటూ రాసుకొచ్చారు.







సాధారణంగా సినిమాలో స్టార్ హీరోతో పాటు మరో స్టార్ హీరో కనిపిస్తేనే భారీగా అంచనాలు ఏర్పడతాయి. తమ అభిమాన హీరో మరో హీరో మూవీలో అతిథి పాత్రలో కనిపించాడంటే ఆ హీరో ఫ్యాన్స్ చేసే హడావుడి మామూలుగా ఉండదు. టాలీవుడ్ లో మల్టీస్టారర్లు ఇప్పుడు కొత్త కాదు. సీనియర్ ఎన్టీఆర్-ఏఎన్నార్ నుంచి జూనియర్ ఎన్టీఆర్- రామ్చరణ్ వరకు అడపాదడపా మల్టీస్టారర్ చిత్రాలు ఆడియెన్స్ అలరిస్తున్నాయి.
అయితే 1987 లో అతిపెద్ద మల్టీస్టారర్ వచ్చింది. కానీ సినిమా అంతా మల్టీస్టారర్ కాదు. ఒక సాంగ్ వరకు మాత్రమే. 1987లో వెంకటేశ్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’ మూవీలో ‘ఒకే మాట ఒకే బాట’ అనే సాంగ్ లో అప్పటి స్టార్ హీరోలు, హీరోయిన్లు సందడి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, తదితర హీరోలు కనిపించారు. ఇక ఈ హీరోలతో పాటు అప్పటి టాప్ హీరోయిన్లు రాధిక, విజయశాంతి, రాధ, భానుప్రియ, సుమలత వంటి హీరోయిన్లు కనిపించారు.
వీరితో పాటు చంద్రమోహన్, మురళీమోహన్, కోడి రామకృష్ణ, విజయనిర్మల, శారద, జయమాలిని వంటి యాక్టర్స్ కూడా ఈ పాటలో తళుక్కున మెరిసి అభిమానులని అలరించారు. ప్రస్తుతం ఈ క్రేజీ మల్టీస్టారర్ సాంగ్ కి సంబంధించిన వీడియో క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



























