ఇండస్ట్రీలోకి వచ్చే నటులలో ఎక్కువ శాతం హీరోలు కావడానికే వస్తుంటారు. అయితే అందరికీ హీరోగా నటించే అవకాశం దొరకడం అంత ఈజీ కాదు. అందువల్ల వచ్చిన అవకాశాన్ని అయిన సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. మంచి గుర్తింపు, క్రేజ్ ను పొందిన తరువాత హీరోగా మారుతుంటారు.
అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్ గా చేసి ఆ తరువాత హీరోలు అయ్యి స్టార్స్ గా మారినవారు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. అయితే హాస్య నటులుగా స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత హీరోలుగా మారిన వారు చాలామంది ఉన్నారు. కానీ హీరోలుగా నిలదొక్కుకున్న వారు చాలా తక్కువ. స్టార్ కమెడియన్స్ గా రాణించి, హీరోలుగా ఫెయిల్ అయిన 10 మంది స్టార్ కమెడియన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. కృష్ణ భగవాన్ :
ఒకప్పటి స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్ ‘జాన్ అప్పారావ్ 40+’ మూవీతో హీరోగా మారాడు. ఆ మూవీ తరువాత మరో సినిమాలో కూడా హీరోగా చేశాడు. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో హీరోగా నిలబడలేకపోయాడు.

2. శ్రీనివాస్ రెడ్డి :
సీనియర్ నటుడు మరియు స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి జయమ్ము నిశ్చయంబురా, జంబ లకిడి పంబ లాంటి సినిమాలలో హీరోగా చేశాడు. కానీ అవి విజయం సాధించలేదు. దాంతో హీరోగా కొనసాగలేదు.

3.షకలక శంకర్ :
‘జబర్దస్త్’ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయిన షకలక శంకర్ పలు సినిమాల్లో కమెడియన్ గా చేశాడు. ఆ తర్వాత హీరోగా శంభో శంకర, నేనే కేడీ నెంబర్ 1 లాంటి సినిమాలు చేశాడు. అవి ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం అంతగా ఛాన్సులు లేవు.

4. ధనరాజ్ :
‘జబర్దస్త్’తో ధనరాజ్ పాపులర్ అయ్యాడు. పలు చిత్రాలలో నటించిన ధనరాజ్, ఆ తర్వాత హీరోగా ‘పనిలేని పులిరాజా’ మూవీలో నటించాడు. కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ హీరోగా నిలబడేందుకు సినిమాలు ఇంకా చేస్తూ ఉన్నాడు.

5. మహేష్ ఆచంట :
‘జబర్దస్త్’ షోతో కమెడియన్ గా పాపులర్ అయిన మహేష్ ఆచంట పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘రంగస్థలం’ మూవీతో క్రేజ్ సంపాదించుకున్నాడు. నేను నా నాగార్జున అనే మూవీతో హీరోగా మారాడు. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో మళ్ళీ అటు వైపు చూడలేదు.
6. రాహుల్ రామకృష్ణ :
రాహుల్ రామకృష్ణ కమెడియన్ గా చేనప్పటికి అర్జున్ రెడ్డి మూవీతో సెకండ్ హీరో స్థాయిలో క్రేజ్ ను పొందాడు. పలు సినిమాలలో నటించిన తరువాత హీరోగా నెట్, ఇంటింటి రామాయణం లాంటి సినిమాలలో నటించినా, హీరోగా నిలబడలేకపోతున్నాడు.
7. అభినవ్ గోమఠం :
స్టార్ కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’ మూవీలో నటించాడు. కానీ ఈ మూవీ నెగిటివ్ టాక్ రావడంతో హీరోగా అభినవ్ గోమఠంను ఆడియెన్స్ అంగీకరించడం కష్టం అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.
8. వైవా హర్ష :
యూట్యూబ్ ‘వైవా’ తో గుర్తింపు, క్రేజ్ పొందిన హర్ష చెముడు, కామెడీ రోల్స్ చేస్తూ వైవా హర్షగా బాగా పాపులర్ అయ్యాడు. రీసెంట్ గా ‘సుందరం మాస్టర్’ మూవీతో హీరోగా మారాడు. అయితే ఆ మూవీ అంతగా మెప్పించలేదు. దాంతో వైవా హర్షని ప్రేక్షకులు హీరోగా అంగీకరించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ఫెరారీ 488 తో పాటు… నాగ చైతన్య గ్యారేజిలో ఉన్న 5 సూపర్ కార్లు మరియు సూపర్ బైక్లు ఇవే..!



అయితే ఈ చిత్రం గురించి చెప్పిన వెంటనే కాంట్రవర్సీలు ఎక్కువగానే వచ్చాయి. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది “ద గ్రేట్ ఇండియన్ కిచెన్” డైరెక్టర్ జియో బేబీ. జియో బేబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా అనగానే ఫాలోవర్స్ లోనూ, ఫ్యాన్స్ లోనూ ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ సినిమాలో కథానాయకగా జ్యోతిక నటించడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీ అంచనాలకు రేగాయి. కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారు అప్పుడే గే పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు అన్న విషయం మీద చాలామంది కాంట్రవర్సీలు వచ్చాయి.













లెజెండరీ దర్శకుడు కె వి రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఒక చిత్రంలో శివుడిగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఆ సమయంలో ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్. పరమశివుడి క్యారెక్టర్ చేసేటపుడు శివుడి మెడలో నాగుపాము కూడా ఉండాలి. నాగుపాము కోసం అప్పట్లో రబ్బర్ పాములను కొందరు ఉపయోగించేవారు. మరికొందరు కోరలు తీసిన పాములను షూటింగ్ కోసం వాడేవారు. ఎన్టీఆర్ కి రబ్బర్ పామును వాడడం వల్ల ఎలర్జీ రావడంతో ఈ మూవీ షూటింగ్ లో కోరలు లేని పామును ఉపయోగించారు.
సన్నివేశాన్ని షూట్ చేసే ముందు పాములను ఆడించే అతను ఆ పాముకి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ క్రమంలోనే పాముకి ట్రైనింగ్ ఇవ్వడం చూసిన ఎన్టీఆర్, అతన్ని ఏమి చేస్తున్నారని ప్రశ్నించారంట. దానికి సింగీతం శ్రీనివాస్ పాము మెడలోకి వెళ్ళేలా ట్రైనింగ్ ఇస్తున్నారని అన్నారంట. అప్పుడు ఎన్టీఆర్ “అలాంటిది ఏమి అవసరం లేదు. వారిని వదిలిపెట్టండి. మెడలోకి ఆయనే వస్తారు” అని అన్నారంట. ఎన్టీఆర్ అలా అనగానే దర్శకుడు కె వి రెడ్డి “ఆయనికి బ్రెయిన్ ఉందని, పాముకి కూడా బ్రెయిన్ ఉంటదని భావిస్తున్నాడా ” అని అన్నారంట.
ఈ సన్నివేశం మొదలై, వెనకాల సౌండ్ స్టార్ట్ కాగానే ఆ పాము నెమ్మదిగా వెళ్లి ఎన్టీఆర్ మెడకి చుట్టుకుని ఆభరణంలా కనిపించిందంట. ఆ దృశ్యాన్ని చూసిన కె వి రెడ్డి, “రామారావు నువ్వు చాలా గొప్పవాడివి, అంతకుమించిన వాడివి” అంటూ దణ్ణం పెట్టారంట. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గత ఏడాది మే 28 నుండి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు.


కళాతపస్వి కె విశ్వనాధ్ మూవీ అంటేనే, దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో సంగీత, నృత్య, సాహిత్య, కళాత్మక విలువల గురించి అద్భుతంగా చూపిస్తుంటారు. అదేకోవలో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్వర్ణ కమలం. ఈ మూవీ అప్పట్లో బంపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్, భానుప్రియ జంటగా నటించగా కీలక పాత్రలలో చాలామంది నటీనటులు కనిపించారు.
కళ అనేది జన్మ జన్మల పుణ్యం వల్లే వస్తుందని గ్రహించలేని వేదపండితుడి కూతురు కథే ఈ మూవీ. సమాజం వేగంగా మారుతోంది. దానితో పాటే మనమూ వెళ్లాలి. సంప్రదాయ కళలనే నమ్ముకుని బావిలో కప్పల బతకడం ఏమిటి అనుకునే మీనాక్షి పాత్రలో భానుప్రియ అద్భుతంగా నటించింది. మూవీ ప్రారంభంలో తండ్రి నేర్పించిన కూచిపూడి నాట్యం కడుపు నింపదనే భావనతో అయిష్టత ప్రదర్శస్తుంటుంది. ఆ సమయంలో ఆమె తయారయ్యే విధానం కూడా గందరగోళంగా ఉంటుంది.
కానీ ఆమెలో మార్పు వచ్చిన తరువాత ఆమె తయారయ్యే విధానంలో మార్పును చూపిస్తూ, దర్శకుడు ఆ విషయాన్ని స్పష్టంగా ఆ సన్నివేశంలో చూపించారు. అప్పటి ప్రేక్షకులు ఈ విషయాన్ని ఎంతవరకు గ్రహించారో లేదో కానీ, ఒక మూవీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించారు. ఆ ఇంటర్వ్యూ కు ఈ రెండు సీన్స్ ను కలిపి చందమామ కథలు అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేస్తూ, అసలు పాత సినిమాలలోనే చాలా కొత్త విషయాలు ఉన్నాయి. కానీ మనం గ్రహించలేదు అంటూ రాసుకొచ్చారు.

