కింగ్ నాగార్జున నటించిన శివ చిత్రం ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది. సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఈ సినిమా విడుదలయింది. శివ చిత్రం నిజంగా చాలా మలుపులు తీసుకువచ్చింది. యువ దర్శకులకు కూడా అవకాశం ఇవ్వద్దని శివ చిత్రం నిరూపించింది. కుర్రాళ్ళకి దర్శకత్వంలో చోటు ఇవ్వొచ్చని నిర్మాతలకి ధైర్యాన్ని పెంచింది.
ఈ చిత్రంతో ఎంతో మంది దర్శకులకు అవకాశాలు కూడా రావడం జరిగింది. శివ చిత్రం నిజంగా ఒక ట్రెండ్ సృష్టించిందని చెప్పాలి. ఈ సినిమా కథ, సాంకేతిక విలువలు వంటి వాటితో ఆశ్చర్యపరిచింది. కింగ్ నాగార్జున ఇమేజ్ కూడా ఈ చిత్రంతో పెరిగిపోయింది.
మొదటి చిత్రంతోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చక్కటి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. శివ చిత్రానికి మంచి విజయం కూడా దక్కింది. టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శివ చిత్రంలో కళాశాల విద్యార్థిగా నటించాడు. బోటనీ పాఠముంది పాటలో పూరి జగన్నాథ్ కూడా స్టెప్పులేశాడు.
రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో బ్లూ షర్ట్ లో కనిపించే నాటి జూనియర్ ఆర్టిస్ట్… నేటి సూపర్ డైరెక్టర్ పూరి జగన్… హే హీరో వాట్ ఏ జర్నీ… అంటూ షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన వాళ్లు ఇప్పుడు ఆకాశ్ ఇలానే ఉన్నాడంటూ కామెంట్లు చేశారు. రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఈ ఫోటోకి పూరి జగన్నాథ్ ఎస్ సార్ అంతా మీ దయ వల్లే అంటూ థాంక్స్ చెప్పారు.