ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలువస్తుంటాయి. వారం వారం కొత్త సినిమాలు విడుదలవుతూ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అయితే సినీ లవర్స్ కి జోనర్ తో పని లేకుండా అన్ని రకాల చిత్రాలను తిలకిస్తారు కానీ హర్రర్, క్రైం థ్రిల్లర్ తో పాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఓటీటీలోకి నేరుగా సరికొత్త రియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఇచ్చింది.

బాలీవుడ్ నటి భూమి ఫెడ్నేకర్ నటించిన తాజా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ భక్షక్. ఈ సినిమాకి పులకిత్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బాద్షా సొంత బ్యానర్ రెడ్ చిల్లి ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ లు ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. పులకిత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా,ఆదిత్య శ్రీవాత్సవ, సాయి తమ్ హంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హిందీ తోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థలతోపాటు చిత్ర బృందం కూడా అధికారికంగా ప్రకటించింది. ఇక కథ విషయానికి వస్తే వసతి గృహాల్లో ఉండే అనాధ అమ్మాయిలు వరుసగా అ-త్యా-చా-రానికి గురవుతూ ఉంటారు ఒక లోకల్ రౌడీ ( ఆదిత్య శ్రీ వాత్సవ ) ఈ మా-ఫి-యాని నిర్వహిస్తూ ఉంటాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వైశాలి ( భూమి ఫెడ్నేకర్)వాటిని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరి బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను వైశాలి ఎలా గుర్తించింది? ఆధారాలతో సహా వాటిని వెలుగులోకి ఎలా తెచ్చింది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే భక్షక్ సినిమాని చూడాల్సిందే అంటున్నారు మూవీ మేకర్స్. ఒక మంచి క్రై-మ్ త్రిల్లర్ సినిమాని చూడాలనుకునే వారికి భక్షక్ మంచి ఛాయిస్ అంటున్నారు.



లోకనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్ తో ఏఎన్ఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నారు. ఒకసారి ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆప్యాయంగా పలకరించి… రండి బ్రదర్ కూర్చోండి… మీరు బాగా వృద్ధిలోకి వస్తున్నారు… మీరు మీ సంపాదనను ఇనుపు ముక్కల మీద పెట్టకండి… స్థలాలు, ఇల్లు కొనుక్కోండి అవే మనల్ని కాపాడతాయి… స్టార్ డం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అని సలహా ఇచ్చారట.





ఆనంద్ మూవీలో సమత అనే అల్లరి పిల్ల పాత్రలో నటించిన బాలనటి అసలు పేరు బఖితా ఫ్రాన్సిస్. 2004లో ఈ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బఖితా ఫ్రాన్సిస్ ఉత్తమ బాల నటిగా నంది అవార్డు అందుకుంది. అయితే ఆమె ఈ మూవీ తరువాత మళ్ళీ వెండితెర పై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. బఖితాకు నటిగా మంచి ప్రతిభ ఉన్నప్పటికీ యాక్టింగ్ తన ఫ్యాషన్ కాదట. శేఖర్ కమ్ముల కోసమే సరదాగా ఆనంద్ మూవీలో నటించిందట.
బఖితా వయసు 26 ఏళ్ళు. ఆమె సమాజ సేవలో ప్రస్తుతం బిజీగా ఉంది. 17 ఏళ్ళ వయసు నుండే బఖితా ఫ్రాన్సిస్ మహిళల హక్కుల కోసం, సొసైటీలో మహిళలకు మగాళ్లతో సమనంగా హక్కులు కల్పించాలని పోరాడుతుంది. అలాగే అమ్మాయిల పై దాడులు గాని, అ-త్యా-చా-రా-లు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని పోరాటం చేస్తోంది. సొసైటీకి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యం తనను ఇలా ఆలోచించేలా చేసిందని అని వెల్లడించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బఖితా, తరచూ తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఈ ఫోటోలను చూసిన కొందరు చాలా అందంగా ఉన్నారు. మళ్ళీ సినిమాల్లో నటించొచ్చు కదా అని అడిగితే, అది తనకు ఇష్టం లేదని బఖితా ఫ్రాన్సిస్ చెప్పారట.
గుర్ఫతే సింగ్ పిర్జాదా అక్క మరెవరో కాదు. ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’ మూవీలో సందడి చేసిన మెహ్రీన్ పిర్జాదా. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వరుణ్ తేజ్‌కి జంటగా మెహ్రీన్ నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో కూడా నటించి అలరించింది.
మెహ్రీన్ పిర్జాదా 1995లో పంజాబ్‌లో నవంబర్ 5న సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె తమ్ముడు గుర్ఫతే సింగ్ పిర్జాదా అనే తమ్ముడు ఉన్నాడు. అతను మోడల్ మరియు నటుడు. మెహ్రీన్ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు. ఆ మూవీ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
మహానుభావుడు, కవచం, రాజా ది గ్రేట్, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 లాంటి చిత్రాలలో మెహ్రీన్ పిర్జాదా నటించారు. ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ చిత్రాలలో నటించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ తరచూ తన ఫోటో షూట్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. మెహ్రీన్ పెట్టే పోస్టులకు లైకుల, కామెంట్లు పెడుతుంటారు.










