ఓటీటీలో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న సినిమా…కానీ బ్రాహ్మణులంటే అలాగే ఉండాలా అంటూ ఓ ఫ్యాన్ రివ్యూ.!

ఓటీటీలో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న సినిమా…కానీ బ్రాహ్మణులంటే అలాగే ఉండాలా అంటూ ఓ ఫ్యాన్ రివ్యూ.!

by Mounika Singaluri

Ads

సలార్ సినిమాకి పోటీగా విడుదలై కర్ణాటకలో సలార్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించిన సినిమా “కాటేరా“. ఇందులో హీరో గా నటించిన దర్శన్ కర్ణాటకలో ఆగ్ర హీరోలలో ఒకరు. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 200 కోట్లకు పైగా సంపాదించింది. అయితే ఈ సినిమా చూసిన ఒక ఫ్యాన్ రివ్యూ ఇవ్వగా ఆ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Video Advertisement

అసలు తన వ్యూ ఏంటో చూద్దాం. సింగపూర్లో కన్నడ సినిమాలు విడుదల చేయడం చాలా అరుదు. అందులోనూ కాటేరాకు మంచి టాక్ వచ్చిందని ఫ్యామిలీ అందరికీ టికెట్లు బుక్ చేసి వెళ్ళాము. అక్కడ దర్శన్ నటన అనుకున్న దానికన్నా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది కానీ కథ విషయానికొస్తే కధ అంతా ఒక ఊరు గురించి అందులో ఉన్న ప్రజల గురించి ఉంటుంది.

అక్కడితో ఆపేస్తే సరిపోతుంది కదా దాన్ని కులమత బేధాల వరకు తీసుకొని వెళ్లడం ఎందుకు? ఇప్పటికీ అదే పాయింట్ని తీసుకుని లాగుతున్నారు. ఈ సినిమాలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. బ్రాహ్మణుడు అంటే పేదవాళ్లే అని ఉండాలా? బ్రాహ్మణుల కుటుంబంలో కచ్చితంగా కులమత బేధాలు ఉంటాయి అని ఎందుకు పదేపదే చూపిస్తున్నారు? ఈనాటి కాలంలో బ్రాహ్మణులు కూడా వేరే కులం వాళ్ళని, వేరే మతం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.

సినిమాలో రక్తపాతం ఉండాలని కావాలని కొన్ని క్యారెక్టర్లే పెట్టారు కానీ దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. కాటేరమ్మ అంటే అందరికీ సాయం చేసే దేవతా. కాటేరమ్మని పూజించిన ప్రతి ఒక్కరు వెనుక ఉంటుంది దానికోసం పశువులని బలి ఇవ్వడం ఎందుకు రక్తపాతాన్ని చూపించడం ఎందుకు? అంటూ ఈ సినిమా గురించి ఆశ్చర్యపోయే రివ్యూ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని బాగుంది అని పొగడగా ఈ ఒక్క రివ్యూయర్ మాత్రమే పూర్తి విరుద్ధంగా సినిమాకి రివ్యూ ఇచ్చి సోషల్ మీడియా అంతా పాపులర్ అవుతున్నాడు. ఈ విషయం మీద కొన్ని మంది ఏకీభవించగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.


End of Article

You may also like