ఎకో ఫ్రెండ్లీగా వివాహం చేసుకోబోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్స్!

ఎకో ఫ్రెండ్లీగా వివాహం చేసుకోబోతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్స్!

by Harika

Ads

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పుడు వారి ప్రేమ పెళ్లి వరకు దారితీసింది. ఫిబ్రవరి 21న గోవా వేదికగా వారి పెళ్లి జరగబోతుంది. అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ పెళ్లి వేడుకలు ఫిబ్రవరి 19 నుంచి మొదలు కాబోతున్నాయి. అయితే రకుల్ జాకీ జంట తమ పెళ్ళి కోసం ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని అనుసరించనున్నారుట. అంటే మామూలుగా స్టార్స్ పెళ్ళిళ్ళు అంటే ఓ రేంజ్ లో జరుగుతూ ఉంటాయి.డెస్టినేషన్ వెడ్డింగ్స్, కలర్ఫుల్ డెకరేషన్స్, స్టార్ సెలబ్రిటీస్, డీజే మోతలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి.

Video Advertisement

అయితే రకుల్ ప్రీత్ సింగ్ వివాహంలో ఇవేవీ ఉండవు. ఇందుకు పూర్తి భిన్నంగా సరికొత్తగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అదే ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్.అంటే టపాసులు, డిజె సౌండ్స్ సిస్టమ్స్ వంటివి ఉండవు వాటి వలన పర్యావరణం దెబ్బతింటుందని వాటిని అవాయిడ్ చేస్తున్నారట. అంతేకాదు పేపర్ వేస్ట్ అవ్వకుండా వివాహ ఆహ్వానాన్ని డిజిటల్ రూపంలోనే చేయిస్తున్నారట.

rakul preet singh jackky bhagnani marriage date

 

అలాగే పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మొక్కలు కూడా నాటుతున్నారని తెలిసింది. పెళ్లి సమయంలో కార్బన్ ఉధ్గారాలు ఎంత వెలుపడతాయో కొలిచేందుకు ఎక్స్పర్ట్ లను కూడా ఉంచనున్నారని తెలుస్తోంది. పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఉత్పత్తి అయ్యే కార్బన్ ఉద్గారాలను వారి సిబ్బంది కొలుస్తారు. తరువాత అందుకు ఎన్ని మొక్కలు నాటాల్సి ఉంటుందో వారు చెప్తారు.ఇది ఒక ప్రత్యేకమైన చర్య. ఈ మొక్కలను పెళ్లయ్యాక వారిద్దరు నాటుతారు. పెళ్లిరోజు గాని ఆ తర్వాత రోజు గాని ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది.ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య రకుల్, జాకీ భగ్నానీ వివాహం జరగనుంది. సినీ ఇండస్ట్రీ నుంచి తక్కువమంది హాజరవుతారని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.


End of Article

You may also like