సీనియర్ నటి అన్నప్పూర్ణ గారు అందరికి సుపరిచితమే. చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. కాగా దేవదాస్ కనకాల ఫ్యామిలీ సంచలన కామెంట్స్ చేసారు ఇటీవలే ఆమె ఇచ్చిన పలు ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ భూమి విషయంలో దేవదాస్ కనకాల ఫ్యామిలీ దారుణంగా మోసం చేసారంటూ ఆరోపణలు చేసారు 22 ఏళ్ల క్రితమే వారి నుంచి భూమి కొనుగోలు చేసారని. అయితే దాన్ని మళ్ళీ తిరిగి తనకు అమ్మిన భూమినే వెంచర్లు వేసి మరీ అమ్మకాలు చేసారని చెప్పారు.

actress-annapurna-comments-on-rajeev-family
ఈ విషయం సుమ కనకాల, రాజీవ్ కనకాల దృష్టికి తీసుకువెళ్లిన వారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయం గురించి మాట్లాడానికి ఒకసారి రాజీవ్ కనకాల కి ఫోన్ చెయ్యగా మొదట బాగానే స్పందించారని అటు తర్వాత ఎప్పుడు ఫోన్ చేసిన బిజీ అని వచ్చేదని చెప్పారు అయితే తనకు తెలిసిన వ్యక్తి ని అడగ్గా ఒక నెంబర్ ఇచ్చారని, తన వద్ద ఉన్న నెంబర్, ఆ వ్యక్తి ఇచ్చిన నెంబర్ ఒక్కటే అని కానీ తనకు అప్పుడు తెలిసిందని తన నెంబర్ బ్లాక్ చేసారు అని చెప్పుకొచ్చారు.
అయితే తనకి తెలిసిన మధ్యవర్తి ని పంపించి అడగ్గా ల్యాండ్ గురించి తనకేమి తెలియదని అంటున్నాడని చెప్పారు. అయితే తనకి ఆ భూమి అక్కర్లేదని మరో చోట ఎక్కడైనా భూమిని ఇప్పించమని అడగ్గా సుమ దంపతులు అంగీకరించడం లేదని తెలిపారు.
Also Read :
ఆ ఒక్క విషయమే నన్ను, ప్రభాస్ ని కలిపేసింది అంటున్న కృతిసనన్.. ప్రభాస్ గురించి ఇంకా ఏమన్నారంటే..?