“ఎవరికి పుట్టాలి అని నేను నిర్ణయించుకోలేను..” అంటూ స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ.. అసలేమైందంటే..?

“ఎవరికి పుట్టాలి అని నేను నిర్ణయించుకోలేను..” అంటూ స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ.. అసలేమైందంటే..?

by Anudeep

Ads

స్టార్ డమ్ తెచ్చుకోవడం అన్నది ఆషామాషీ వ్యవహారం ఏమి కాదు. ప్రస్తుతం సోషల్ మీడియా అందరి నట్టింట్లో ఉన్న సమయం లో కూడా.. వైరల్ అయినంత ఈజీ గా స్టార్ డమ్ సంపాదించుకోలేము. సెలెబ్రిటీలు అవడానికి వెనక ఎన్నో రోజుల నిద్ర లేమి, శ్రమ ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర పై ఆకట్టుకుంటున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. ఆమె కూడా ఎవరి సపోర్ట్ లేకుండానే సినిమా ఇండస్ట్రీ కి వచ్చారు.

Video Advertisement

rashmi 3

మనముందు మేకప్ వేసుకుని..చిరునవ్వులతో కనిపించినా వారి జీవితం లోను ఎన్నో విషాద గాధలు ఉంటాయి. ఒక్కో సారి సందర్భం వచ్చినపుడు బరస్ట్ అయిపోతూ ఉంటారు. ఇటీవల రష్మీ కూడా అలానే ఎమోషనల్ అయ్యారు. ఓంకార్ హోస్ట్ చేస్తూ ఉన్న ” సిక్త్ సెన్స్ ” అనే ఓ షో కి రష్మీ గౌతమ్ హాజరు అయ్యారు. ఈ షో కి రష్మీ గెస్ట్ గా వచ్చి అందరిని అలరించి.. సంతోషం గా ఆడిపాడారు.

rashmi 2

కానీ.. అమ్మా నాన్న ల గురించిన ప్రస్తావన వచ్చినపుడు మాత్రం రష్మీ చాలా ఎమోషనల్ అయ్యారు. కళ్లనీళ్లు పెట్టుకుంటూ తల్లితండ్రులకు విజ్ఞప్తి చేసారు. “మా అమ్మ సింగల్ మదర్ అని.. పిల్లలకి తాము ఎవరికీ పుట్టాలని ఛాయస్ ఉండదని..ఎక్కడ పుట్టాలి.. ఎవరికీ పుట్టాలి అన్న విషయాన్నీ ఎంచుకోడానికి ఎవరికీ అవకాశం ఉండదని” ఆమె ఎమోషనల్ గా చెప్పారు.

rashmi

సమస్యలకి పిల్లలు బాధ్యులు కాలేరని ఆమె చెప్పుకొచ్చారు. రిలేషన్ షిప్ ల పైన నమ్మకం లేనప్పుడు పిల్లలను ఈ ప్రపంచం లోకి తీసుకురావద్దంటూ ఆమె కోరారు. రష్మీ అమ్మ గారు ఒరిస్సాకు చెందినవారు. అలాగే.. ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. రష్మీ పుట్టిన కొన్నాళ్ళకి వారిద్దరి మధ్య విబేధాలు తలెత్తడం తో వేరు వేరు గా ఉంటున్నారు. ఈ క్రమం లోనే రష్మీ విశాఖ లోని అమ్మమ్మ,తాతయ్యల వద్ద పెరిగారు. అక్కడ నుంచి ఇండస్ట్రీ లో ఎవ్వరి సపోర్ట్ లేకుండా.. ఆమె ఈ స్థానాన్ని సంపాదించుకున్నారు.


End of Article

You may also like