ఒక యాక్టర్ కి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అలా ఎంతో కష్టపడి ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత, వాళ్లు చేసే ప్రతి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకుంటారు. అలా ఎంతో మంది యాక్టర్లు వాళ్ళ స్టైల్ లో గుర్తింపు సంపాదించుకొని ఎన్నో రికార్డులు నెలకొల్పారు.
ఈ రికార్డ్స్ నెలకొల్పే సమయం రావడానికి చాలా మంది నటులకు చాలా సంవత్సరాలు పట్టింది. కానీ కొంత మంది నటులు మాత్రం వారు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తల్లోనే ఎన్నో కొత్త రికార్డ్స్ నెలకొల్పారు. వారిలో ఒకరు తారకరత్న. తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ సినిమా ఎంతో పెద్ద విజయం సాధించింది.
ఆ తర్వాత యువరత్న, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు తారకరత్న. అయితే తారకరత్న తన మొదటి సినిమా సమయంలోనే ఒక్క రోజులో దాదాపు 9 సినిమాలకు సైన్ చేశారట. అలా మొదటి సినిమా విడుదలకు ముందే అన్ని ప్రాజెక్ట్స్ లో సైన్ చేసిన హీరోగా రికార్డు నెలకొల్పారు తారకరత్న. ఇంకొక విషయం ఏంటంటే ఈ రికార్డ్ ని ఇప్పటి వరకు ఎవరూ బీట్ చేయలేదు.
తారకరత్న, రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.అలాగే కొంత కాలం క్రితం విడుదలైన మనమంతా సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు తారకరత్న. ఇటీవల తారకరత్న దేవినేని అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇది మాత్రమే కాకుండా ప్రస్తుతం ఇంకా కొన్ని సినిమాల్లో కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు తారకరత్న.