నేడు యాక్టర్ నిఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భం గా ఆయన నటిస్తున్న “18 పేజెస్” సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమా లో అనుపమ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ జంట గా కనిపిస్తున్నారు. హీరో నిఖిల్ కు కళ్ళకు గంతలు కట్టి ఉండగా… ఆ కళ్ళ గంతలపై అనుపమ ఎదో రాస్తూ కనిపిస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ నిఖిల్ పుట్టిన రోజు సందర్భం గా ఈ పోస్టర్ ను రివీల్ చేసారు. సుకుమార్ సినిమాలంటేనే చాలా భిన్నం గా ఉంటాయి. మరి ఈ లవ్ స్టోరీ ఏ విధం గా ఉండబోతోందో చూడాలి. పోస్టర్ చూస్తూనే కొంత ఆసక్తిని రేకెత్తించే విధం గా ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతోంది.