స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా మహమ్మారి సోకినా సంగతి తెలిసిందే. తనకు పాజిటివ్ అని తెలియగానే బన్నీ క్వారంటైన్ కు వెళ్ళిపోయాడు. తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు అందరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరాడు. దాదాపు పదిహేను రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న బన్నీ ఇటీవలే కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. తాజాగా బన్నీ కి నెగటివ్ గా తేలింది. ప్రోటోకాల్ ఫాలో అయిన తరువాత.. బన్నీ ఇంటికి చేరుకున్నాడు. బన్నీ పిల్లలతో ఎంత సన్నిహితం గా ఉంటారో తెలిసిందే. ఇన్ని రోజులు డాడ్ కి దూరం గా ఉన్న పిల్లలు.. బన్నీ ఇంటికి రాగానే ఎలా రియాక్ట్ అయ్యారో ఈ వీడియో లో చూడండి..
View this post on Instagram


























