ఒక్కొక్కసారి పాత తరం నాటి హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూ ఉంటాయి. అయితే కొందరు అప్పుడెలా ఉన్నారో… ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. అయితే ప్రస్తుతం తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఆ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి ఈమె ఆ హీరోయిన్ ఆ..? అంటూ గుర్తుపట్టలేకపోతున్నారు.

ఈ హీరోయిన్ పేరు బర్ఖా మదన్. సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్ లాంటి వారితో మిస్ ఇండియా పోటీలో పోటీపడి కొద్దిలో టైటిల్ చేజార్చుకుంది. తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ పోటీల్లో కూడా రన్నరప్ నిలిచింది. తర్వాత పలు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. 1996 లో ఖిలాడియో కా ఖిలాడి సినిమాతో హీరోయిన్ అయ్యింది. 2012 సంవత్సరం వరకు కేవలం 6 సినిమాల్లో నటించింది.ఇందులో రామ్ గోపాల్ వర్మ తీసిన భూత్ సినిమా ఒకటి.ఈ సినిమాలో దెయ్యంగా అద్భుతమైన నటనను కనబరిచింది.తర్వాత నాలుగు సీరియల్స్ లో నటించింది.
కెరీర్ మంచి స్పీడ్ మీద ఉన్న సమయంలో సన్యాసిగా మారిపోయింది.2012 లోనే బౌద్ధ మతం లోకి వెళ్ళాలి అనుకుంది కానీ అది తర్వాత కొద్ది కాలానికి కుదిరింది.మతం మారిన తర్వాత ఆమె పేరును గ్యాల్టెన్ స్టామెన్ గా మార్చుకుంది. ప్రస్తుతం పర్వతాల్లోనూ, ఆశ్రమాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈమెయిల్ చూసిన అభిమానులు షాక్ కి గురవుతున్నారు. అలనాటి అందాల హీరోయిన్ ఇప్పుడు ఇలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.













ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ మూవీకి ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ‘తొలి ప్రేమ’ అనే కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన హీరో ఆనంద్ దేవరకొండ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్‌లకు ఈ మూవీతో మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. వీరితో పాటుగా హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన కుసుమ డెగల మర్రికి గుర్తింపు దక్కింది. ఇలా ఈ మూవీలో నటించిన వారందరికీ బేబీ మూవీ ఊహించనంత గుర్తింపును తీసుకొచ్చింది.
అయితే అందరూ ఆ బేబీ హీరోయిన్ వైష్ణవి గురించే కాకుండా హీరోయిన్ కాలేజీ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పేరే ‘కిర్రాక్ సీత’. ఇప్పటికే ఆమె యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. తెలుగు వెబ్ సిరీస్‌లలో నటించింది. షార్ట్ ఫిల్మ్‌లు ద్వారా సీత మంచి పేరు తెచ్చుకుంది. ఆమె 21 వెడ్స్ 30, పెళ్లికూతురు పార్టీ, సరయు, మూడు చేపల కథ వంటి వాటిలో నటించి ఆకట్టుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు.
కుమారీ ఆంటీ ట్రెండింగ్ లోకి రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా అందరు స్ట్రీట్ ఫుడ్స్ మీదే దృష్టి పెట్టారు. కుమారీ ఆంటీ విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడంతో మరింతగా వార్తల్లో నిలిచింది. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కు ముఖ్యమంత్రి వస్తారని వార్తలు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరుద్యోగులు కుమారీ ఆంటీ స్టాల్ కు వెళ్లి నిరసన కూడా వ్యక్తం చేశారు.
యూట్యూబ్ ఛానెల్స్ కుమారీ ఆంటీ వంటి వారిని వెతికి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కుమారీ ఆంటీ గురించి, నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పూర్తి పేరు సాయి కుమారి. గత పదమూడు సంవత్సరాలుగా ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టాల్ పెట్టకముందు సింగర్ హేమ చంద్ర ఇంట్లో పని చేసేవారంట. ఆ తరువాత ఫుడ్ స్టాల్ మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, ఆలీ లాంటి సెలెబ్రెటీలు సైతం కూరలు తీసుకెళ్తారని కుమారీ ఆంటీ వెల్లడించారు.
రీసెంట్ గా హీరో సందీప్ కిషన్ కూడా ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లి భోజనం తిని వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫుడ్ తిన్న తరువాత సందీప్ కిషన్ కుమారీ ఆంటీకి పదివేల రూపాయలు ఇచ్చారట. కుమారీ ఆంటీకి ఇంతగా క్రేజ్రావడంతో బిగ్ బాస్ షోలోకి ఆమెను తీసుకుంటారేమో అంటూ నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు.










