తమిళ హీరో అయినా కూడా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్. ఈ మధ్య తాను సినిమాలు ఆపేస్తారు అని ప్రకటించారు. అయితే అంతకుముందు విజయ్ చాలా రీమేక్ సినిమాల్లో నటించారు.
ఇప్పుడు మరొక సినిమాని రీమేక్ చేయబోతున్నారు అనే వార్త వస్తోంది. ఆ సినిమా మరేదో కాదు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

కానీ ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఎందుకంటే విజయ్ ఇంకొక రెండు సినిమాలు మాత్రమే చేస్తారు అని అన్నారు. కానీ ఇప్పుడు ఈ వార్త అయితే వచ్చింది. అయితే విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న గోట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్లో నటిస్తారు అని వార్త వస్తోంది. విజయ్ ద్విపాత్రాభినయం చేయడం ఇది మొదటి సారి ఏమీ కాదు. ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఇంకొక సినిమా ఉంటుంది. మరి ఆ సినిమా తర్వాత అసలు విజయ్ సినిమాల్లో నటిస్తారు లేదు అనేది కూడా తెలియదు.

విజయ్ అసలు నటించడానికి దూరంగా ఉంటారా? లేదా కొన్ని రోజులు ఎన్నికల పనులు చూసుకొని ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తారా అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ ఏదేమైనా సరే, విజయ్ అభిమానులు మాత్రం విజయ్ మళ్ళీ తిరిగి సినిమాల్లోకి రావాలి అనే అనుకుంటున్నారు. ఎందుకంటే విజయ్ కి ఇంత గుర్తింపు వచ్చింది సినిమాల వల్ల. కాబట్టి ప్రేక్షకులు విజయ్ ని ముందు నటుడి గానే చూడాలి అని అనుకుంటున్నారు. ఒకపక్క రాజకీయాల్లో ఉంటూనే మరొక పక్క సినిమాలు కూడా చేస్తే బాగుంటుంది అని చాలామంది అంటున్నారు. మరి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.



1. యానిమల్ – నాన్న ( పాపా ):
2. ఖడ్గం – నువ్వు నువ్వు:
3. ఆచార్య – పాదగట్టం:
4. బ్రహ్మాస్త్ర – శివ:









గత ఏడాది రామ్ చరణ్-ఉపాసన జంటకు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలిలోకి వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగితేలుతుంది. క్లీంకార జన్మించినప్పటి నుండి వారి ఫ్యామిలిలో శుభాలే జరుగుతున్నాయి. గత ఏడాది రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం, లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి, తాజాగా చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ ప్రకటించడం వరుసగా శుభవార్తలే వినిపిస్తున్నాయి. ఇదంతా తన మనవరాలి రాక వల్లే అని ఆస్కార్ వచ్చిన సమయంలో మెగాస్టార్ స్టేట్మెంట్ సైతం ఇచ్చారు.
క్లీంకార ఫోటోను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. క్లీంకారతో బయటికి వచ్చినా ఆమె ఫేస్ కనిపించకుండా చరణ్, ఉపాసన జాగ్రత్త పడుతున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ అంతా ఆమెను చూడాలని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉపాసన క్లీంకార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తోంది. అయినప్పటికి ఆ క్లీంకార ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా క్లీంకారకు సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ఆమె కేర్ టేకర్ సావిత్రి శాలరీ.
రామ్ చరణ్ ఉపాసన క్లీంకార కోసం ఒక కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. ఆమె సెలెబ్రెటీ సావిత్రి. ఆమె ఇంతకు ముందు పలువురు సినీ సెలబ్రెటీల పిల్లలకు కేర్ టేకర్ గా వ్యవహరించారు. బాలీవుడ్ లో కరీనా కపూర్ కొడుకు తైమూరుకు, షాహిద్ కపూర్ పిల్లలకు సావిత్రి కేర్ టేకర్ గా వ్యవహరించారు. ఒక ఇంటర్వ్యూలో కరీనా సావిత్రి పై ప్రశంసలు కురిపించింది. రీసెంట్ గా రామ్ చరణ్ దంపతులు ముంబై వెళ్లారు. అది సావిత్రిని కలవడానికే అని టాక్. క్లీంకార కేర్ టేకర్ గా పనిచేస్తున్న సావిత్రికి లక్షన్నర జీతం ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.







కథ:
