కొంతమంది నటులకి ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్లు పడతాయి. అవి ఎలా ఉంటాయంటే మెయిన్ క్యారెక్టర్స్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. అవ్వటానికి ఆ క్యారెక్టర్లు సైడ్ క్యారెక్టర్లు కానీ ఫ్రెండ్ గాని సిస్టర్ గాని అయి ఉంటాయి . కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ కి డైలాగులు కూడా ఉండవు అయినా మెయిన్ క్యారెక్టర్స్ కంటే కూడా పాపులర్ అయిపోతూ ఉంటారు. అలాంటి కొన్ని క్యారెక్టర్లు ఇప్పుడు చూద్దాం.
#1. డియర్ కామ్రేడ్: డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే అయితే హీరోయిన్ రష్మిక కన్నా ఆమె అక్కగా నటించిన శృతి రామచంద్రన్ చాలా బాగుంటుంది అని సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి.

#2. లవర్స్ డే: ఈ సినిమాలో చాలామంది ప్రియా ప్రకాష్ వారియర్ ని చూడటానికి వెళ్లారు. అయితే ఈ సినిమాలో ప్రియా కన్నా నూరిన్ షరీఫ్ ఎక్కువ ఫేమ్ కొట్టేసింది.

#3 అశోక వనంలో అర్జున కళ్యాణం: ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా విశ్వక్సేన్ మరియు రుక్షర్ నటించారు అయితే రుక్షర్ కి చెల్లెలుగా నటించిన రితికా నాయక్ ఎక్కువగా అందరి హృదయాలని దోచుకుంది.

#4 అంబాజీపేట మ్యారేజి బ్యాండు
అంబాజీపేట మ్యారేజి బ్యాండులో మల్లి (హీరో సుహాస్) కి అక్క పద్మగా నటించిన శరణ్య ప్రదీప్ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ లనే డామినేట్ చేసి హైలైట్ అయ్యారు. ‘ఫిదా’లో సాయిపల్లవి అక్కగా నటించారు శరణ్య.

#5 ఉయ్యాల జంపాల : ఈ సినిమాలో అవికా గోర్ ఎంత అలరించిందో ఆమెకి ఫ్రెండ్ గా నటించిన పునర్నవి కూడా హీరోయిన్ కి తీసుకొని ఫేమ్ ని సంపాదించుకుంది.

#6 వీర సింహారెడ్డి : ఈ సినిమాలో హీరోయిన్ కన్నా హనీ రోజ్ కి ఎక్కువ మంది ఫ్లాట్ అయిపోయారు.

#7. యానిమల్
యానిమల్ సినిమాలో జోయపాత్రలో నటించిన త్రిప్తి దిమ్రి హీరోయిన్ రష్మిక కంటే హైలైట్ అయ్యారు. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన అయినా కూడా ఒక చిన్న రోల్ చేసిన త్రిప్తి దిమ్రి టాప్ ఆఫ్ ది టౌన్ అయింది. ఉన్న పది నిమిషాలు అయినా సరే తన అంద చందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణబీర్ తో కలిసి రొమాన్స్ లో రెచ్చిపోయింది. త్రిప్తిని అందరూ కూడా తమ క్రష్ లిస్టులో యాడ్ చేసేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో త్రిప్తికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ చిన్నది భారీ ఆఫర్స్ ని సైతం సొంతం చేసుకున్నట్లు వినిపిస్తుంది. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో త్రిప్తి ఎన్నికైనట్లు వార్త వచ్చింది. అలాగే రవితేజ సినిమాలో కూడా త్రిప్తి నటిస్తోంది అంటూ టాలీవుడ్ లో వార్త హల్చల్ చేస్తుంది.

#8 అఆ : ఈ సినిమాలో సమంత కి ఎంత పేరు వచ్చిందో సెకండ్ హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కి కూడా అంతే పేరు వచ్చింది.

#9 సలార్: అలాగే ఈ మద్యే వచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా సలార్ లో నిజానికి హీరోయిన్ శృతిహాసన్. కానీ రాధా రమ పాత్ర చేసిన శ్రియ రెడ్డికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ రావడం గమనార్హం.

#10. మంగళవారం
పాయల్ తో పాటు “మంగళవారం” సినిమాలో బాగా హైలైట్ అయింది మాత్రం జమీందారు భార్యగా నటించిన “దివ్య పిల్లై”. చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ అమ్మాయి చివరిలో ఇచ్చిన ట్విస్ట్ అందరికీ మతిపోయింది. మలయాళం లో చాలా సినిమాలు నటించింది. టివినో థామస్ కలా సినిమాలో హీరో భార్యగా నటించింది. మలయాళం తో పాటు తమిళ్ లో కూడా రెండు సినిమాలు చేసింది. ఇక తెలుగులో మంగళవారం సినిమా కంటే ముందు తగ్గేదేలే అనే మూవీలో నటించింది.





ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/జి బృందావన కాలనీ మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పలు రికార్డులను సృష్టించింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. కమర్షియయల్ గా హిట్ అయ్యింది. ఈ మూవీకి గాను రవి కృష్ణ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డ్ అందుకున్నాడు. ఈ మూవీ సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు.
ఈ మూవీ తరువాత రవి కృష్ణ తన తదుపరి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వరుస అపజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు పొందడంలో కూడా విఫలమయ్యాడు. తెలుగు, తమిళం భాషల్లో కలిపి సుమారు 8 సినిమాలలో హీరోగా నటించాడు. వీటిలో ‘7/జి బృందావన కాలనీ’ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
2011 తరువాత రవి కృష్ణ మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అవకాశాలు లేక ఎక్కువ సమయం ఇంటి దగ్గరే గడుపుతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రవి కృష్ణ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల 7/జి బృందావన కాలనీ సీక్వెల్ రాబోతున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రవి కృష్ణ బరువు తగ్గించుకుని, సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.

కేవలం కొత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా, పాత సినిమాల గురించి కూడా ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. అలాగే పాత సినిమాల్లో, లేదా సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొన్ని ఫేమస్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, పాటలు కూడా ఇప్పుడు టెంప్లేట్స్ లాగా మనకి తరచుగా కనిపిస్తూనే ఉంటాయి.




















