గుర్తు పట్టలేనంతగా మారిపోయిన 7/జి బృందావన్ కాలనీ హీరో..? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన 7/జి బృందావన్ కాలనీ హీరో..? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

by kavitha

Ads

టాలీవుడ్ లో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మొదటి సినిమా విజయం సాధించినప్పటికీ  ఆ తరువాత అవకాశాలు పొందలేక తెరమరుగు అయిన హీరోలు చాలామంది ఉన్నారు. అంతేగాక తొలి సినిమాతో హిట్ అందుకుని, ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోలు కూడా ఎందరో ఉన్నారు.

Video Advertisement

అలాంటి హీరోలలో ‘7/జి బృందావన కాలనీ’ సినిమాలో నటించిన ‘రవి కృష్ణ’ కూడా ఒకరు. అతను ఎవరో కాదు ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం మూడవ కుమారుడు. తెలుగులో మూడు సినిమాలు మాత్రమే చేసిన రవి కృష్ణ ఆ తరువాత కనిపించలేదు. ప్రస్తుతం రవి కృష్ణ ఎలా ఉన్నారో? ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
Ravikrishna-7-g-brundavan-colony-movie-heroప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/జి బృందావన కాలనీ మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. పలు రికార్డులను సృష్టించింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. కమర్షియయల్ గా హిట్ అయ్యింది.  ఈ మూవీకి గాను రవి కృష్ణ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డ్ అందుకున్నాడు. ఈ మూవీ సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు.
ఈ మూవీ తరువాత రవి కృష్ణ తన తదుపరి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వరుస అపజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు పొందడంలో కూడా విఫలమయ్యాడు. తెలుగు, తమిళం భాషల్లో కలిపి సుమారు 8 సినిమాలలో హీరోగా నటించాడు. వీటిలో ‘7/జి బృందావన కాలనీ’ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
2011 తరువాత రవి కృష్ణ మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం అవకాశాలు లేక ఎక్కువ సమయం ఇంటి దగ్గరే గడుపుతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రవి కృష్ణ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇటీవల 7/జి బృందావన కాలనీ సీక్వెల్ రాబోతున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రవి కృష్ణ బరువు తగ్గించుకుని, సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.

https://www.instagram.com/p/Cf-hFgJJUWx/

Also Read: ప్రభాస్ “కల్కి 2898 AD” లో ఉన్న సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… ఆ సినిమాల నుండి కాపీ కొట్టారా..?


End of Article

You may also like