HAPPY ENDING REVIEW: “హ్యాపీ ఎండింగ్”…మూవీ రివ్యూ….! ఈ చిన్న సినిమా హిట్ కొట్టిందా..?

HAPPY ENDING REVIEW: “హ్యాపీ ఎండింగ్”…మూవీ రివ్యూ….! ఈ చిన్న సినిమా హిట్ కొట్టిందా..?

by Harika

Ads

ప్రతివారం కొత్త సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈ శుక్రవారం ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి. ప్రతివారం కొత్తవాళ్లతో మా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈవారం కూడా హ్యాపీ ఎండింగ్ సినిమాతో ఒక కొత్త టీం ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ సినిమా ఎలా ఉంది…? ప్రేక్షకులకు నచ్చిందా లేదా…? అనేది రివ్యూ చూసి తెలుసుకుందాం…!

Video Advertisement

  • చిత్రం : హ్యాపీ ఎండింగ్
  • నటీనటులు : యష్ పూరి, అపూర్వ రావ్, అజయ్ ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనితా చౌదరి తదితరులు
  • నిర్మాత : సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, యోగేష్ కుమార్ (హ్యామ్స్ టెక్, సిల్లిమాంక్స్ స్టూడియోస్)
  • దర్శకత్వం : కౌశిక్ భీమిడి
  • సంగీతం : రవి నిడమర్తి
  • సినిమాటోగ్రఫి: అశోక్ సీపల్లి
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2024

కథ:

చిన్నప్పుడు మేనక థియేటర్లో తెలియక చేసిన ఒక తప్పు వల్ల బాబా (అజయ్ ఘోష్) ఊహించని విధంగా హర్ష్ (యష్ పూరీ)ని శపిస్తాడు. అప్పటి నుండి హర్ష్ ఎవరినైతే రోమాంటిక్ గా ఊహించుకుంటాడో వాళ్ళు చనిపోతు ఉంటారు. అందువల్ల ఇక తమ జీవితంలో ప్రేమ, పెళ్లి అనేవాటి గురించి ఆలోచించకుండా,మ్యాకప్ మేన్ గా పనిచేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు.ఇలా ఉండగా అనుకోకుండా అవ్ని (అపూర్వ రావు)తో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం జరిగిపోతాయి. అప్పట్నుంది ఎక్కడ సంసారం చేస్తే తన భార్య చచ్చిపోతుందో అని భయపడుతూ దూరంగా ఉంటాడు. దీంతో ఇటు పర్సనల్ లైఫ్ అతు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ చాలా డిస్టర్బ్ అవుతాడు.అసలు బాబా ఇచ్చిన శాపం నిజంగానే పని చేస్తుందా? హర్ష్ కి ఆ శాపం నుండి విముక్తి ఎలా లభించింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి…!

విశ్లేషణ:

ఒక సింపుల్ పాయింట్ తో ఎంగేజింగ్ గా సినిమాని తెరకెక్కించడం అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్. ఈ టెక్నిక్ ను ఈ సినిమా దర్శకుడు కౌశిక్ పూర్తిగా అర్ధం చేసుకోలేదని సినిమా మొదలైన 30 నిమిషాలకు అర్ధమైపోతుంది.ఈ కథను ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే రీతిలో తెరకెక్కించడంలో కౌశిక్ విఫలమయ్యాడు. అలాగే క్యారెక్టర్ ఆర్క్స్, స్క్రీన్ ప్లే వంటి విషయాల్లో కనీస స్థాయి జాగ్రత్త వహించలేదు. సీన్ కంపోజిషన్స్ & షాట్ డివిజన్స్ చూశాక ఎక్కడా కొత్తగా కనిపించదు.

ఇక నటీనటులు విషయంలో హర్ష్ పాత్రలో యష్ పూరీ చాలా స్టైలిష్ గా కనిపించాడు.నటుడిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన ఫిట్ నెస్ లెవెల్స్ పై పెట్టిన శ్రద్ధ యాక్టింగ్ స్కిల్స్ మీద మాత్రం కనీస స్థాయిలో కూడా పెట్టలేకపోయాడు.ఇక హీరోయిన్ అవని అనే మెచ్యూర్డ్, ఇండిపెండెంట్ అమ్మాయి పాత్రలో అపూర్వ రావు బాగా ఆకట్టుకుంది. విష్ణు ఓయ్ కామెడీ పండించడానికి ప్రయత్నించినప్పటికీ అది వర్కవుటవ్వలేదు. అజయ్ ఘోష్, ఝాన్సీ తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సంభాషణలు, సంగీతం ఈ సినిమాకి పెద్ద మైనస్. వివేక్ సాగర్ తరహాలో ప్రయత్నించిన సాంగ్స్ చిరాకు పెట్టిస్తాయి.కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ మాత్రం డీసెంట్ గా ఉన్నాయి.

రేటింగ్: 2/5

watch trailer:

Also read: MISS PERFECT REVIEW : లావణ్య త్రిపాఠి నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 


End of Article

You may also like