నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న నటి నందిత శ్వేత. తమిళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన నందిత శ్వేత, తర్వాత తెలుగు సినిమాలతో కూడా బిజీ అయిపోయారు.
వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నందిత శ్వేత సినిమాలు చేస్తున్నారు. అయితే, నందిత శ్వేత గత సంవత్సరం నటించిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

ఈ సినిమా పేరు రా రా పెనిమిటి. గత ఏడాది ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకి సత్య వెంకట్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి అంటే, సినిమా మొత్తం ఒకటే పాత్రతో రూపొందించారు. రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమాని ఓటీటీలోకి రిలీజ్ చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా హంగామా ప్లే లో స్ట్రీమ్ అవుతోంది. అంతే కాకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. కానీ ఇది భారతదేశంలో అందుబాటులో లేదు.

ఇంక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, టైటిల్ కి తగ్గట్టే భర్త కోసం ఎదురు చూస్తున్న ఒక భార్య. చివరికి అతను వచ్చాడా? లేదా? అనే విషయం మీద ఈ సినిమా నడుస్తుంది. సినిమా మొత్తం నందిత శ్వేత పాత్ర మాత్రమే కనిపిస్తారు కాబట్టి ఆమె చాలా బాగా నటించారు. ఒకటే పాత్ర అయినా కూడా సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే బాగుంది. నందిత శ్వేత డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ, డిఫరెంట్ గా ఉన్న పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాగా, ఒక మంచి పాత్ర ఉన్న సినిమాగా నిలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 2008లో సత్యం అనే తమిళ యాక్షన్ డ్రామా మూవీలో నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ సహచరుడు ఎ. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకి దర్శకుడిగా మొదటి సినిమా. ఈ మూవీలో విశాల్ తొలి సారిగా పోలీసు క్యారెక్టర్ లో నటించాడు.
లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. అయితే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని ‘సెల్యూట్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు, అయితే ఈ మూవీ తమిళ, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించారు. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. సెల్యూట్ మూవీ 2008లోఆగస్టు 14న విడుదలైంది.
ఈ చిత్రాన్ని విశాల్ అన్న విక్రమ్ కృష్ణ నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీలోని ఒక యాక్షన్ సీన్ ను ఇన్ స్టా ఎంటర్టైన్మెంట్ జోన్ అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆ సీన్ లో విశాల్ కిక్ చేసిన బాల్ రౌడీలందరికి తగిలి, మళ్ళీ విశాల్ చేతిలో రొటేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఎవరో బోయపాటికి బ్రదర్ లాగా ఉన్నాడు అని కామెంట్స్ పెడుతున్నారు.












బయోపిక్ డ్రామాగా వచ్చిన “తర్లా ” ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హుమా ఖురేషి, షరీబ్ హష్మీ జంటగా నటించారు. పూర్ణేందు భట్టాచార్య, భారతీ అచ్రేకర్, వీణా నాయర్ తదితరులు నటించారు. కథ విషయనికి వస్తే, పెద్ద కలలు కనే మిడిల్ క్లాస్ అమ్మాయి తర్లా (హుమా ఖురేషి). జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకునే ఆమెకి పెళ్లి జరగడంతో సినిమా మొదలవుతుంది. వృత్తిరీత్యా ఇంజనీర్ నలిన్ (షరీబ్ హష్మీ)ని తర్లా పెళ్లి చేసుకుంటుంది.
కాలేజ్‌కి వెళ్లే తర్లా పెళ్లి అనంతరం వంట చేయడం ఎలా నేర్చుకుంది. అందరికి ఆదర్శంగా నిలిచే విధంగా ఆ తరువాత తన సొంత వంటల పుస్తకాలతో, భర్త సపోర్ట్ తో ఎలా ఎదిగింది అనేది స్టోరీ. హుమా ఖురేషి తర్లా దలాల్ పాత్రలో మెప్పించింది. షరీబ్ హష్మీ భార్యకు సహాయం చేసే భర్త పాత్రలో మెప్పించాడు.
మూవీలోని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. పాటలు ఫర్వాలేదు. సింపుల్ కథను చక్కగా చూపించారు. సాలు కె థామస్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. రాకేష్ యాదవ్ ప్రొడక్షన్ డిజైన్ మరియు తస్నీమ్ ఖాన్ కాస్ట్యూమ్స్ 1960-80 కాలానికి సంబంధించినవి ఉపయోగించారు. తర్లాను ఫిల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు.



అయితే మరణంతో పోరాడిన విజయకాంత్ చివరికి చావు చేతిలో ఓడిపోక తప్పలేదు. అయితే ఈయన మరణం కోలీవుడ్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ వచ్చారు. ఇప్పటికకీ ఈయన సమాధి వద్దకు వందలాది మంది అభిమానులు వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఈ విషాద సంఘటన నుంచి విజయ్ కాంత్ కుటుంబం ఇంకా బయటపడలేదనే చెప్పాలి.
