కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు కనిపిస్తూ ఉంటారు. ఆ పాత్రల కోసం ఒక్కొక్కసారి హీరోలు, హీరోయిన్లు చేస్తూ ఉంటే, ఇంకొకసారి డైరెక్టర్లు చేసేస్తారు. అలా చాలా సినిమాల్లో డైరెక్టర్లు కొన్ని పాత్రల్లో నటించారు.
కొంత మంది డైరెక్టర్లని మనం సినిమా చూసినప్పుడు గుర్తుపట్టలేము. కానీ తర్వాత సినిమా టీవీలో చూస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ ని గుర్తుపడతాం. ఇటీవల అలా ప్రభాస్ నటించిన ఒక సినిమాలో ఆ సినిమా డైరెక్టర్ నటించారు.

అది కూడా బాహుబలికి ముందు. ప్రభాస్ నటించిన సినిమాలో ఆ డైరెక్టర్ కనిపిస్తారు. ఆయన మరెవరో కాదు. వంశీ పైడిపల్లి. ప్రభాస్ హీరోగా నటించిన మున్నా సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు అనే సంగతి తెలిసిందే. ఇదే వంశీ పైడిపల్లి మొదటి సినిమా. ఈ సినిమాలో వేణుమాధవ్ తో ఉన్న ఒక సీన్ లో వంశీ పైడిపల్లి కనిపిస్తారు. వంశీ పైడిపల్లి అంతకుముందు వర్షం సినిమాలో కూడా ప్రభాస్, త్రిష ప్రయాణిస్తున్న బస్ లో ఒక ప్యాసింజర్ గా కనిపిస్తారు.

ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ తర్వాత మున్నా సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి సినిమాలకి దర్శకత్వం వహించారు. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి తలపతి విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా తమిళ్ సినిమా అయినా కూడా, తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా వచ్చి ఏడాది అయ్యింది. వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ సినిమా ఇంకా ప్రకటించలేదు. విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్నారు అనే వార్త వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబుతోనే మరొక సినిమా చేస్తారు అనే వార్త కూడా వచ్చింది. ఇంకా చాలా మంది హీరోల పేర్లు ఇలాగే వచ్చాయి. మరి నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారు అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
watch video :
https://www.instagram.com/reel/C2Tmj6ZpQs8/?utm_source=ig_web_copy_link
ALSO READ : వెండితెర పై హీరో గా అడుగు పెట్టాలనుకున్న నారాలోకేష్.. జస్ట్ మిస్.. అసలేం జరిగిందంటే..?


















మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ చక్రవర్తి. ఆయన 1950లో జూన్ 16న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో బెంగాలీ దిగువ మధ్యతరగతి హిందూ ఫ్యామిలిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి చక్రవర్తి దంపతులకు. అతను ఓరియంటల్ సెమినరీలో చదువుకున్నాడు మరియు తరువాత తన బీఎస్సి కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కళాశాల చేశాడు. ఆ తరువాత, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాడు.
బెంగాల్ లో నక్సలైట్ ఉద్యమం మొదలైన తరువాత ఇతర వేలాది బెంగాలీ యువకుల లాగానే, మిథున్ కూడా 1960ల చివరలో నక్సల్ పోరాటంలోకి వెళ్లారు. కోల్‌కతాలో నక్సలైట్ పోరాటం జరిగే టైమ్ లో చారు మజుందార్‌తో పనిచేశారు. అయితే నక్సలైట్ల పై పోలీసుల అణిచివేత వల్ల మిథున్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నక్సలైట్ గా మరడంతో ఆయన ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. అదే సమయంలో మిధున్ సోదరుడు యాక్సిడెంట్ లో మరణించడంతో తిరిగి ఇంటికి వచ్చిన మిథున్ మళ్ళీ అటు వైపు చూడలేదు.
ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఒక్క పూట భోజనం కూడా దొరికేది కాదు. కొరయోగ్రాఫర్ హెలెన్ దగ్గర చేరారు. స్టేజ్ పై డ్యాన్స్ చేసేవాడు. తన డ్యాన్స్ చూసి అయినా సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో అని. ఎన్ని రోజులు 1976లో మృగయా మూవీతో మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని సంచలనం సృష్టించారు. ఆ తరువాత పలు సినిమాలలో నటించినా, 1982లో వచ్చిన ‘డిస్కో డాన్సర్’ మూవీతో సూపర్స్టార్డమ్ అందుకున్నాడు.
దేశంలోనే తొలి వందకోట్ల మూవీగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఇండియాలోనే కాకుండా రష్యాలో కూడా పాపులారిటీ పొందారు. డ్యాన్స్ స్టార్‌గా పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు చేసి అగ్రహీరోగా మారారు. ఓ దశలో వరుసగా 33 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ చెక్కచెదరలేదు. 1979లో నటి యోగీతా బాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు మిమోహ్, ఉష్మే చక్రవర్తి , నమషి చక్రవర్తి , దత్తపుత్రిక దిశాని చక్రవర్తి. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన మిథున్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.
జైలర్ మూవీలో కు విలన్ గా, సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఈ మూవీలో నటనతో ఆకట్టుకున్న వ్యక్తి మలయాళ యాక్టర్ వినాయగన్. ఇతను నటుడు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కూడా. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించే వినాయగన్ పలు తమిళ చిత్రాలలో కూడా నటించారు
వినాయకన్ తొలిసారిగా 1995లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళంలో వచ్చిన ‘మాంత్రికం’ మూవీలో నటించాడు. వినాయకన్ తర్వాత కలి, ఒరుతీ, ట్రాన్స్, మరియు పద వంటి సినిమలలో నటించారు. 2016లో, దర్శకుడు రాజీవ్ రవి తెరకెక్కించిన ‘కమ్మటిపాడమ్‘ లో గంగ పాత్రలో తన నటనకు గాను వినాయకన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
తమిళంలో వినాయకన్ నటించిన ఏడవ సినిమా జైలర్. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఎంత క్రూరంగా ఉంటుందో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కనిపిస్తుంది. వినాయకన్ తెలుగులో కూడా నటించాడు. అయితే అతను ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘అసాధ్యుడు’. అనే సినిమాలో విలన్ నటించాడు.



