గత ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా సంచలన విజయం సాధించింది. రజనీకాంత్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా కనిపించిన సినిమా ఇది.
చాలా రోజుల తర్వాత జైలర్ రజనీకాంత్ కమర్షియల్ సక్సెస్ కొట్టారు. విడుదలైన ప్రతి చోట సంచలమైన వసూలతో జైలర్ మంచి లాభాలు తెచ్చిపెట్టింది.రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో తమన్నా ఒక పాటలో మెరిసింది.

అలాంటి ఈ సినిమా సీక్వెల్ కి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను డైరెక్టర్ నెల్సన్ రజనీకి చెప్పి ఓకే చెప్పించుకున్నాడనే వార్త కొన్ని రోజుల క్రితమే షికారు చేసింది. ఇప్పుడు ఈ సినిమా కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం జైలర్ టీం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆ పాత్రకి ఆమె దాదాపు ఓకే చెప్పింది అని అంటున్నారు. రజనీ,నయన్ కాంబినేషన్ లో ఆల్రెడీ నాలుగైదు సినిమాలు వచ్చాయి.
మరోసారి జైలర్ 2 కోసం కలిసి తెరపై కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే జైలర్ 2 లో నయనతారను ఏ పాత్రకు తీసుకున్నారు అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే నయన్ కు మాత్రం ఈ సినిమా కోసం భారీగా పారితోషకం ముట్టచెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.





























