సీతాఫలం దీని పేరు వింటేనే నోరూరిపోతుంది. ఎక్కువగా తెలంగాణలో ప్రాంతంలోని గుట్టలు, అడవుల్లో లభ్యమవుతాయి.. దీని రుచి చాలా బాగుంటుంది. ఈ ఫలం కాస్త ఎర్రగా మారి పండకుండా ఉండని దోరకాయలు తీసుకొని వివిధ రకాల ఆహార పదార్థాలు తయారుచేసుకొని ఆస్వాదించవచ్చు. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.. ఎన్ని రకాల ఫుడ్స్ తయారు చేయవచ్చో ఓ సారి చూద్దాం..?
#1 కాల్చిన సీతాఫలం
ఎర్రగా పాటుకు వచ్చి ఇంకా దోర కాయలను తీసుకొని ఒక మంట వేసి అందులో వేస్తారు. అది బాగా కాలీ ఫైనల్ గా బొగ్గుల అయిన తర్వాత వాటిని మంట లో నుంచి తీసి చల్లార్చిన తర్వాత తింటే మామూలు సీతాఫలం తిన్నట్టే ఉంటుంది.. దీని రుచి కాల్చిన మొరం గడ్డ లాగా కాస్త తీపి గా ఉంటుంది.

#2 సీతాఫలంతో ఐస్ క్రీం
సీతాఫలంతో ఐస్ క్రీమ్ కూడా తయారుచేస్తారు.. న్యాచురల్ గా సీతాఫలం ఐస్ క్రీమ్ చాలా ప్రసిద్ధి చెందింది.

#3 సీతాఫలం జ్యూస్
ఇది ఎక్కువగా చెన్నైలో కనబడుతుంది. సీతాఫలం నుండి గింజలు తీసి, వాటిని పాలతో కలిపి జ్యూస్ తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.


మన హెల్దీగా ఉండాలంటే నీరు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటాం.. కానీ కొంతమంది తాగాల్సిన టైంలో కాకుండా మిగతా టైం లో నీరు తాగుతూ ఉంటారని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.. తిన్న వెంటనే నీరు తాగొచ్చా.. ఏంటో ఒక సారి చూద్దాం..!!
అయితే తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జీర్ణక్రియ నిర్వహణ అనేది అప్పుడే ప్రారంభం అవుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి రెండు గంటల సమయం పడుతుంది.. ఈ క్రమంలో నీరు తాగితే జీర్ణక్రియ వేడి తగ్గుతుంది. దీని వల్ల అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావితం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు..
వ్యక్తి తిన్న తర్వాత ఒక గంట విరామం తీసుకొని నీరు తాగితే అతని బరువును నియంత్రించ వచ్చు.అలాగే ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ బలంగా తయారవుతుంది.








#1 రోజ్ వాటర్ ఆరెంజ్ తొక్క
#2 గ్రీన్ టీ ప్యాక్ బాదం
#3 తేనే బియ్యంపిండి
#4నిమ్మరసం
15 నుంచి 25 ఏజ్ లో యువ రక్తంతో ఉరకలు వేస్తారు.. ఇంకా వయసు పెరిగే కొంచెం కొంచెం మనలో మార్పులు చాలా జరుగుతాయి.. ఎత్తు తగ్గడం అనేది ఇందులో ముఖ్యమైంది. అయితే దీనికి ప్రధాన కారణం జన్యు లోపం అనుకుంటారు. కానీ అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి 18-20 ఏండ్ల వరకు మాత్రమే ఎత్తు పెరుగుతారు.
ఆ తర్వాత మనం ఎంత ఎత్తు పెరిగితే అంతే ఎత్తుతో 30-40 ఏండ్ల వరకు ఉంటాం. ఆ తర్వాత ఏజ్ లో తగ్గడం మొదలవుతుంది. సైన్స్ ఏ బి సి నివేదిక ప్రకారం చూస్తే.. ఈ వయసు తర్వాత వృద్దాప్యానికి సంబంధించిన అన్ని ప్రభావాలు శరీరంపై కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎత్తు ఉంటుంది. ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత శరీరం కుచించుకుపోవడం స్టార్ట్ అవుతుంది..
30-40 ఏండ్ల మధ్యలో ఎత్తు తగ్గడం ప్రారంభమై 10 సంవత్సరాల పాటు తగ్గుతుంది.. ఒక వ్యక్తి తన పొడవులో పాదాలు, ఎముకలు, పుర్రె పై ఎటువంటి ప్రభావం చూపదు. కానీ వెన్నుపాము పొడవు మాత్రం తగ్గడం ప్రారంభం అవుతుంది. దానిలో ఉన్నటువంటి డిస్క్ సన్నబడడం మొదలవుతుంది. దీని యొక్క ఎఫెక్ట్ మన పొడవు పైనే పడుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి.. అవి ఖనిజ లవణాల కొరత వల్ల సన్నగా మారడంతో వాటి పరిమాణం తగ్గడం మొదలవుతుంది.
దీంతో పాటుగా పాదాల్లోని 2 ఎముకల మధ్యలో కదలికలను సులభతరం చేసే లిగమెంట్ కూడా బలహీనంగా అవ్వడం ప్రారంభమవుతాయి. పురుషులు గానీ స్త్రీలు గానీ ఏజ్ పెరిగే కొలది ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది.. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఎత్తు తగ్గుతారు. అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.






