ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం బాగుంటే మనం ఏ పనైనా చేయవచ్చు.. అందుకే ఆరోగ్యంపై మనం దృష్టి పెట్టాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే వేసవికాలంలో ఎక్కువ చలవ చేసే ఆకు కూరలు తింటే చాలా మంచిది.. ఇందులో మరీ ముఖ్యంగా పాలకూర, తోటకూర ఎంతో మేలు.. వీటికి తోడుగా గంగవాయిల కూర కూడా తినవచ్చు. ఈ కూరను మామిడికాయ ముక్కలతో కలిపి వండితే లొట్టలేసు
కుంటూ తింటారు. గంగవాయిల కూరలో అనేక పోషక పదార్థాలు విటమిన్లు, ఖనిజ లవణాలు యాంటీ ఆక్సిడెంట్ అద్భుతంగా లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపుకు తోడ్పడుతుంది.. అలాగే ఇమ్యూనిటీని పెంచడంలో సహాయం చేస్తుంది. ఆరోగ్యకరమైన టువంటి కణ విభజనకు కూడా మంచి ఫలితాన్నిస్తుంది. వీటితోపాటుగా విటమిన్ సీ శరీరంలోని రక్తనాళాలను మరియు గాయాలను నయం
చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ గంగవాయిలి కూరలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా ఎముకలకు కావలసిన మెగ్నీషియం, క్యాల్షియం ఇందులో అధికం. ఎముకల దృఢత్వానికి చాలా సహాయపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఎముకల సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్స్ కొన్ని గుండె పోటు లాంటి సమస్యలను నివారిస్తాయి.