ఎగ్జామ్స్ టైం : మీ పిల్లలకి పరీక్షలా..? వారికి పెట్టె ఫుడ్ విషయంలో ఈ డైట్ టిప్స్ పాటించండి..!

ఎగ్జామ్స్ టైం : మీ పిల్లలకి పరీక్షలా..? వారికి పెట్టె ఫుడ్ విషయంలో ఈ డైట్ టిప్స్ పాటించండి..!

by Anudeep

Ads

ఏప్రిల్, మే నెలలు వచ్చాయంటే పిల్లలందరూ పరీక్షల హడావిడి లో మునిగిపోతూ ఉంటారు. వారికి వారి చదువు గురించి తప్ప మరో ధ్యాస ఉండని సమయమిది. పూర్తిగా చదువులో మునిగిపోయి ఒక్కోసారి తిండిని కూడా నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారు. అయితే.. వారు వేళకి సరిగ్గా తింటేనే ఆరోగ్యంగా ఉండి పరీక్షలను బాగా రాయగలుగుతారు.

Video Advertisement

వారు సరిగ్గా తినేలా చూసే బాధ్యత పేరెంట్స్ దే. ఓ పక్క మండే ఎండలు, మరో వైపు ఎగ్జామ్స్ హడావిడి. ఈ పరిస్థితిలో చాలా మంది పిల్లలకి సరిగ్గా తిండి సహించదు. ఏదో తిన్నాం అంటే తిన్నాం అన్నట్లు ఉంటారు.

exams 1

అందుకే వారు సరిగ్గా బాలన్స్డ్ డైట్ ను తీసుకునే విధంగా తల్లి తండ్రులు జాగ్రత్త వహించాలి. అందుకే.. కొన్ని టిప్స్ మీకోసం. వాళ్ళని ఎప్పుడు ఆక్టివ్ గా ఉంచే ఎనర్జిటిక్ ఆహారాలను అందివ్వాలి. ఈ పరీక్షల సమయంలో పొద్దున్నే ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ లో వారికి కాల్షియమ్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను అందివ్వాలి. అలాగే పదునైన మెమరీ పవర్ కోసం నానబెట్టిన బాదాం, అంజీర్ డ్రై ఫ్రూట్స్ ను ఇవ్వాలి.

exams 2

వీటి వలన వారి మెదడు చురుకుగా పని చేసి వారు చదివిన విషయాలను జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు. అలాగే.. ప్రస్తుతం వేసవి సమయం కాబట్టి వారు హైడ్రేటెడ్ గా ఉండేటట్లు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వారికి గుర్తు చేసి మంచినీళ్లను ఇవ్వాలి. దీనివల్ల వారు త్వరగా అలసిపోరు. అలాగే ఒత్తిడి తగ్గించడం కోసం యోగ, మెడిటేషన్ చేయించాలి. పరీక్షల కాలం కాబట్టి వారిని జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచడమే మంచిది. విటమిన్ సి అధికంగా ఉండే, ఇమ్మ్యూనిటి ని పెంచే సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా వారి ఆహారంలో భాగం చేయడం వలన అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.


End of Article

You may also like