మనలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇళ్లల్లో రాత్రి పూట కచ్చితం గా ఎంతో కొంత అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మరీ కొంచం ఐతే పర్లేదు ఎవరికైనా ఇచ్చేస్తాం.. కానీ.. చాలా ఎక్కువ ఉండిపోయినపుడు.. దానిని మరుసటి రోజు తింటూ ఉంటాం. సద్ది అన్నం తినడం మంచిదే అయినా.. దానిని గది ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు ఉంచడం మంచిది కాదు.
అన్నం వండిన రెండు మూడు గంటలలోపు తినేయడం ఉత్తమం. ఒకవేళ అలా కుదరకపోతే ఆ అన్నాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచేసుకుని మరుసటి రోజు తినవచ్చు. గది ఉష్ణోగ్రత లో ఎక్కువ సేపు అన్నాన్ని ఉంచడం వలన బాక్టీరియా చేరుతుంది. అలాగే.. వేడి గా అన్నం తినాలని అనుకుంటే.. ఒకసారి వేడి చేసుకుని తింటే పరవాలేదు. మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం కూడా అంత ఆరోగ్యకరం కాదు.