కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ గా మన జీవితాల్లోకి చొరబడి.. అతలాకుతలం చేసేసింది కరోనా వైరస్. ప్రశాంతం గా సాగిపోతున్న జీవన గమ్యాన్ని మార్చేసింది. కరోనా ముందు లైఫ్ ఒకలా.. ఇప్పుడు లైఫ్ వేరేలా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ కరోనా వల్ల మనం ఎదుర్కొన్న ఒక కొత్త అనుభవం.. రోజుల తరబడి ఇంట్లోనే ఉండిపోవడం. అంతకు ముందు ఎప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొని ఉండరు ప్రజలు. అయితే ఈ కరోనా వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదుర్కొంటున్నాం. వాటిలో ప్రధానమైనది ఒత్తిడి.
ఈ కరోనా కారణం గా అందరూ ఇంట్లోనే ఉండిపోయారు కానీ అందరి మధ్య తెలియని గోడలు పెరిగిపోయాయి. కొందరు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబం తో హ్యాపీ గా గడిపి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
కానీ ఈ సమయం కొందరు మహిళలకు చాలా ఒత్తిడి కలిగించే ఫేజ్ గా మారింది. ఇంట్లో భర్త, పిల్లలకు ఎంతో ఇష్టం గా పనులు చేసే మహిళలు ఈ కరోనా కాలం లో చాలా ఒత్తిడికి గురయ్యారు. వారి పని పంచుకోలేక.. మనసులో మాటలు పంచుకోలేక ఎంతో ఇబ్బంది పడ్డారు మహిళలు. ఈ ఒత్తిడి కారణం గా వారికీ అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సరిగా ఆహారం తీసుకోక పోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం వంటివి వారి శరీరం లో అనేక మార్పులు వచ్చేలా చేస్తున్నాయి. అంతే కాకుండా ఊరికే అలసి పోవడం, చిన్న విషయాలకు విసుక్కోవడం, బాధపడటం ఇవన్నీ ఒత్తిడి ని తెలిపే లక్షణాలే. ఇటువంటి లక్షణాలను గుర్తించి కుటుంబ సభ్యులు వారికీ అండగా నిలవాలి.
ఒత్తిడితో బాధపడుతున్నట్టు వాళ్లకు తెలియకపోయినా.. ఇతరులు మాత్రం ఈజీగా గుర్తిస్తారు. పని ఎక్కువైనప్పుడు, భాగస్వామితో గొడవ జరిగేటప్పుడు, ఆర్థిక విషయాల్లో మీలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తారు. ఒత్తిడి ఎప్పుడో ఒకసారి వస్తే ఏం పర్లేదు కానీ.. ఎప్పుడూ దీనితో బాధపడితే మాత్రం ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
స్ట్రెస్ వల్ల రక్తపోటు దారుణంగా పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. శరీరం బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. ఇక ఈ సమయంలో లోతైన శ్వాసను తీసుకోవాలి. అయితే స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్కరూ ఇలా బిహేవ్ చేయరు. కొంతమంది ఏ విషయాన్నైనా లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటారు. విషయాలను కఠినమైనవిగా తీసుకున్నవారే ఎక్కువగా స్ట్రెస్ కు గురవుతుంటారు.
శారీరక శ్రమ తగ్గి ఒత్తిడి పెరగటం వల్ల శరీరంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయన్నది మనకు తెలిసిందే. దీని వల్ల అనేక రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఒత్తిడి వల్ల మీ ఆలోచనలో మార్పులొస్తాయి. ఏకాగ్రత కోల్పోతారు. పనిపై శ్రద్ధ ఉండదు. పనిచేయలేకపోతుంటారు. మీ బ్రెయిన్ విశ్రాంతి లేకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా విసుగ్గానే ఉంటారు. ఊరికే చిరాకు పడతారు. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఆందోళనకు గురవుతుంటారు. తమను తామే తక్కువగా చేసుకుంటారు.
డిప్రెషన్ కు లోనవుతారు. ఎందరున్నా లోన్లీ గానే ఫీలవుతారు. అలాగే బాడీ పెయిన్స్ ఉంటాయి. మజిల్స్ కూడా నొప్పిగా ఉంటాయి. హెడేక్ వస్తుంది. తెల్లవార్లూ నిద్రుండదు. కాళ్లు, చేతులు చల్లబడతాయి. ఊరికూరికే నోరు ఎండిపోతుంది. ఛాతిలో నొప్పి కలుగుతుంది. చేతులు వణుకుుతాయి. ఏది మంచి ఏది చెడు అన్న విషయాలను గుర్తించలేకపోతారు. ఆలోచనలు నిలకడగా ఉండకపోవడం వంటి లక్షణాలు కనిస్తాయి.
ఈ స్ట్రెస్ ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే.. గుండెపోటుతో పాటుగా ఇతర హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అధిక రక్తపోటు బారిన కూడా పడతారు. అలాగే డిప్రెషన్, షుగర్ వ్యాధి. యాంగ్జైటీ, ఊబకాయం, స్కిన్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు, పల్స్ రేటు మారడం, మతిమరుపు, హార్మోన్ ల అసమతుల్యత, అల్సర్, ఎప్పుడూ తినాలనిపించడం వంటి సమస్యలు వస్తాయి.
స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి అంటే..
ఒత్తిడికి ఎన్నో కారణాలుంటాయి. కానీ ఇది మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి వల్ల పనులను అస్సలు పూర్తిచేయలేము సరికదా.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే అప్పటికప్పుడే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అదెలాగో తెలుసుకుందాం పదండి.
#1
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువును తగ్గించడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది.
#2
సంగీతం మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడి స్థాయిలు ఎక్కువైనప్పుడు వెంటనే మీకు నచ్చిన సాంగ్స్ ను పెట్టుకుని వినండి.
#3
ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడు విసుగ్గా అనిపిస్తుంది. అందులో పనిపూర్తికాకపోతే చిరాకుతో పాటుగా ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇక కొన్ని కారణాల వల్ల మీ బాస్ మిమ్మల్ని అవమానించినప్పుుడు మానసిక అస్థిరత ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పజిల్ గేమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే కాసేపు ఆటలు ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలో పోతుంది.
పైన చెప్పినవన్ని కూడా ఒత్తిడిని తగ్గించే పద్ధతులే. ఇవే కాక ఇంట్లో ఒక చోట మీకు ప్రశాంతతనిచ్చేలా మొక్కలు, కుషన్స్, పుస్తకాల తో అరేంజ్ చేసుకోవడం, వంట, గార్డెనింగ్, డ్యాన్స్ చేయడం, బొమ్మలు వేయడం, బొమ్మలకి రంగులు దిద్దడం, ఏదైనా అల్లడం, ఏదైనా క్రాఫ్ట్ నేర్చుకోవడం, పావుగంట చిన్న కునుకు తీయడం, మీకు నచ్చే ఫొటోస్ చూసుకోవడం, చిన్న పాటి మెడిటేషన్, ఆక్యు ప్రెషర్ .. ఇలాంటి వన్నీ కూడా మీకు స్ట్రెస్ నుండి రిలీఫ్‌ని ఇస్తాయి.