భార్య భర్తల బంధం అనేది ఎంతో అపురూపమైనది. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరితో ఒకరు తోడుంటూ జీవితాన్ని కొనసాగించడమే నిజమైన భార్య భర్తల సంబంధం.
ఇలాంటిదే ఒక కథ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతనికి వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే భార్యను ఉన్నత చదువులు చదివించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఏదో విషయం మీద దిగులుగా ఉందనే విషయాన్ని గమనించాడు. తమ 8 వ పెళ్లి రోజు కానుకగా ఒక అద్భుతమైన బహుమతిని భార్యకు ఇచ్చి ఆశ్చర్యపరిచాడు

అనీష్ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా రజితను ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుందామని వీరిరువురు నిర్ణయించుకున్నారు. అనీష్ కుటుంబం వారు ఒప్పుకున్నా, రజిత కుటుంబ వారి పెళ్ళికి నిరాకరించారు.

చివరకు రజిత కుటుంబవారు ఒక షరతు మీద వీరి పెళ్లి జరగడానికి ఒప్పుకున్నారు. ఎలాంటి పెళ్లి ఆచారం లేకుండా కట్టుబట్టలతో తీసుకెళ్ళమని అనీష్ కుటుంబాన్ని కోరారు. వరుడు అనీష్ బంధువులు మరియు స్నేహితుల సమక్షంలో చాలా సాధారణంగా డిసెంబర్ 29 2014 లో వివాహం చేసుకున్నారు.
అనీష్ కి వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రజితను ఉన్నత చదువులు చదివించారు. భర్త ఆసరాతో రజిత కామర్స్ లో పీహెచ్డీ చదువులు పూర్తి చేసింది. ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అనీష్, భార్యలో ఏదో అసంతృప్తి కల్పిస్తున్నట్లు గమనించాడు. ఏదైనా పెళ్లి వేడుకలో పాల్గొన్న భార్య మొహంలో ఒక చింత కనిపించేది అనీష్ కి. తమ పెళ్లి అంత సాదాసీదాగా జరిగిపోవడం విధిరాత అని అనుకుంటూ ఉండేది రజిత.
రజిత కి వధువుగా అలంకరించుకోవాలి అనే కోరిక ఉండేది. వారి పెళ్లి రోజున తీసిన ఫోటోలు వీడియోలులో రజిత అన్నిటిలోనూ విచారంగానే కనిపించింది. ఇది చూసిన అనీష్ కు ఎంతో బాధగా అనిపించి తమ 8వ పెళ్లి రోజును వారే ఎప్పటికీ మర్చిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు అనీష్.

తమ 7 ఏళ్ల కుమార్తె అమ్ము సాక్షిగా పెళ్లినాటి ప్రమాణాలు చేస్తూ వెడ్డింగ్ ఫోటోషూట్ ను ఏర్పాటు చేశారు. అనీష్ రజిత వధూవరులుగా ముస్తాబయ్యారు. అట్టుకల్ దేవాలయం, శంకుముఖం బీచ్ తో సహా అనేక ప్రదేశాలలో ఫోటోషూట్ జరిగింది. ఈ ఫోటోలు డిజిటల్ ఆల్బమ్ గా మారింది. ఈ సారి ఫోటోలో ప్రత్యేకత ఏంటంటే “రజిత ముఖం చిరునవ్వుతో” వెలిగిపోయింది. భార్య కలను నెరవేర్చిన ఈ భర్త ఎంత గొప్పవాడో కదా..
ALSO READ : VARALAKSHMI VRATHAM 2023: వరలక్ష్మీ వ్రత విధానం మరియు విశిష్టత..!














మన పితృస్వామ్య వ్వవస్థ కుటుంబంలో అల్లుడూ, కోడలు ఇద్దరూ వేరే కుటుంబాల నుండి వచ్చినప్పటికీ, కోడలికి కుటుంబ బాధ్యతను, అల్లుడికి అయితే హోదా ఇచ్చింది. ఇక ఇల్లరికం వెళ్ళిన అల్లుడు అయితే బాధ్యతలో కోడలితో సమానంగా చూస్తారు. అందువల్లనే ఇల్లరికపు అల్లుడిని ఇంటికి పెద్ద పాలికాపు అని అంటారు. సాధారణంగా ఎవరింటి కైనా వెళ్ళినపుడు అతిథి పాటించే నియమాలన్నీ కూడా అల్లుడికి అత్తవారింటికి వెళ్ళిన సమయంలో వర్తిస్తాయని చెప్పచ్చు.
చదువు అనేది ప్రస్తుతం ఉన్న ఆడపిల్లలను ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వల్ల జీవితాన్ని నిలబెట్టుకుంటూ, తల్లిదండ్రుల తమ కోసం పడిన కష్టాన్ని అర్ధం చేసుకుని, ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. అదే సమయంలో ఆర్ధికంగా నిలబడి తల్లిదండ్రులకు చాలా ఊతం ఇస్తున్నారు.
ఇది కాయిన్ కు ఒక వైపు. కానీ మరో వైపు బాధ్యత లేనటువంటి ఆడపిల్లలు నేను బాగా చదువుకున్నాను. నేను డిగ్రీ హోల్డర్ ని, నాకేంటి, ఎలాగైనా బ్రతికేస్తా అనే వైఖరి కనిపిస్తోంది. బాధ్యత లేని ఆడపిల్లలు ఒక విధనమైన ఇగో లేదా పొగరును చూపిస్తున్నారు. చేతిలో డిగ్రీ ఉందని, తామే గొప్పవారమనే భావనలో బయటికి వచ్చి, చేతిలో డిగ్రీ ఉందని, ఫాల్స్ థింకింగ్ లో ఉండిపోతున్నారు. ఎక్కడికెళ్ళినా, వీళ్ళు మాట్లాడిన మాటే జరగాలి అనే మొండితనంతో ప్రవర్తిస్తున్నారు.
ఈ మొండితనంను చిన్నతనం నుండే గమనించాల్సి ఉంటుంది. ఆ లక్షణాన్ని గమనించినపుడే వారికి నేర్పాల్సి ఉంటుంది. ఇగో అనేది ఆడపిలల్లకు పుట్టింట్లోనే చిన్నతనం నుండే ఎదిగేటపుడు వారితో పాటు ఎదుగుతూ వస్తుంది. ఇంట్లో వాళ్ళదే పై చేయిగా ఉండాలని, పెత్తనం చేయాలని చూస్తుంటారు. వాళ్ళకి జీవితం విలువ తెలియదు. అలాంటి వాళ్ళకి డబ్బు కూడా తెలియదని చెపుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్రింది వీడియోను చూడండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోని శింగమనల నాగుల గడ్డకు చెందిన సాకే భారతి, ఆమె భర్త ప్రోత్సాహంతో శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీలో కెమిస్ట్రీలో పిహెచ్డి పూర్తి చేసి, గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకోవడంతో ఆమె వెలుగులోకి వచ్చింది. ఆమె ఎలాంటి కోచింగ్ కు వెళ్లలేదు. కెమిస్ట్రీని చదివి, పీహెచ్డీ చేసింది. ఆమెకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ పీహెచ్డీ పట్టాను అందచేశారు.
వేదిక పైకి భారతి భర్త, కూతురుతో కలిసి వచ్చింది. పారగాన్ చెప్పులు వేసుకుని, సాదా చీర ధరించి వచ్చిన భారతి ఆహార్యాన్ని చూసిన వేదిక పైన పెద్దలు, అతిథుల ముఖాల్లో ఆశ్చర్యం. ఆ తరువాత లక్ష్యసాధనకు పేదరికం అడ్డంకి కాదని నిరూపించిన భారతిని చూసి సంతోషపడ్డారు. భారతి చిన్నతనం నుండే బాగా చదువుకోవాలని కోరుకునేది. టెన్త్ క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకుంది.
ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో భారతి పెద్దది. బాధ్యతల భారం, కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో ఆమెకు మేనమామ శివప్రసాద్‌తో పెళ్లి చేశారు. ఆమె భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నది. కానీ వాటి గురించి భర్తకు చెప్పలేదు. కానీ శివప్రసాద్ భారతి కోరికను అర్థం చేసుకుని, పై చదువులు చదివడానికి ప్రోత్సాహన్ని అందించాడు.
భారతి తమ జీవితాలను మార్చుకోవడం కోసం ఇదే ఒక మంచి అవకాశం అని భావించింది. కానీ భర్త ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దాంతో ఆమె కొన్నిరోజులు కూలీ పనులకు వెళ్ళేది. మరి కొన్ని రోజులు కాలేజీకి వెళ్తూ డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. అప్పటికే ఆమెకు ఒక కూతురు. ఆమె ఆలనా పాలనా చూస్తూనే భారతి అటు చదువు, ఇటు కులీ పనులు, ఇంటి పనులు సమన్వయం చేసేది. రోజూ అర్ధరాత్రి వరకూ చదువుకునేది. మళ్లీ పొద్దున్నే లేచి మళ్ళీ చదువుకునేది. ఇక కాలేజీకి వెళ్లాలంటే ఆమె ఉండే ఊరి నుండి 28 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి.
వారిది రవాణా ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి. దాంతో భారతి 8 కిలోమీటర్ల దూరంలో ఉండే గార్లదిన్నె ఊరు వరకు నడిచి, అక్కడ బస్సు ఎక్కేది. ఇన్ని కష్టాల మధ్య ఆమె డిగ్రీ మరియు పీజీ మంచి మార్కులతో పాస్ అయ్యింది. ఆమె ప్రతిభను చూసిన భర్త శివప్రసాద్, ప్రొఫెసర్లు భారతిని పీహెచ్డీ చేసే దిశగా ఆలోచించమని చెప్పారు. అలా ప్రయత్నించగా ఆమెకు ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ వద్ద ‘బైనరీ మిక్చర్స్’ అనే అంశం పై పరిశోధనకు అవకాశం వచ్చింది.
పీహెచ్డీ కోసం వచ్చే ఉపకార వేతనం ఆమెకి కొంత వరకు సాయపడింది. అయినా భారతి కూలి పనులు చేయడం మానలేదు. ‘‘డాక్టరేట్ చేస్తే యూనివర్సిటీ స్థాయిలో జాబ్ పొందవచ్చు. ఆ ఉద్యోగం మా జీవితాలను బాగు చేస్తుంది. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఎందరికో పంచే అవకాశం ఉంటుంది. తాను సాధించిన విజయం తన లాంటి వారెందరికో ప్రేరణను ఇస్తుంది” అని భారతి చెప్పుకొచ్చారు.






