ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఈరోజు (అక్టోబర్ 14)న ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం ఈరోజు రాత్రి 8 గంటల 34 నిముషాలకు మొదలై, అర్ధరాత్రి 2 గంటల 25 నిముషాలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు.
దేశంలో గ్రహణం కనిపించకపోయినా, విదేశాలలో మాత్రమే కనిపించినా కూడా, గ్రహణ ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు. ఈ సూర్యగ్రహణం వల్ల ఐదు రాశుల వారికి శుభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. మిథున రాశి:
ఈ సూర్యగ్రహణం వల్ల మిథున రాశికి చెందినవారికి శుభప్రదం అని, మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాశివారు వారి కెరీర్లో కొన్నింటిలో సక్సెస్ పొందుతారట. మానసిక ప్రశాంతత కలుగుతుందట. వీరికి ఆర్థికంగా లాభపడే ఛాన్సులు ఉన్నాయని, ఆఫీసులో ఈ రాశి వారు చేసే వర్క్ ప్రశంసించబడుతుందని చెబుతున్నారు. సూర్య గ్రహణ టైమ్ లో ఆదిత్య హృదయం చదివితే శుభ ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
2. సింహరాశి:
సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసే వారు లాభాలను పొందవచ్చు. వీరు ఫ్యామిలితో సంతోషంగా గడుపుతారు. శత్రువులు ఈ రాశివారికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు తలవంచరు. నేడు ఆదిత్య హృదయంతో పాటుగా, సూర్య జపం చేసుకుంటే శుభ ఫలితం ఉంటుంది.
3. తులారాశి:
తులారాశి చెందిన వారికి ఈ సూర్యగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సొసైటీలో వీరి స్థాయి పెరుగుతుంది. చేసే పనిలో సక్సెస్ ను సాధిస్తారు. అదృష్టం ఉంటే,పెండింగ్ లో ఉన్న పని సైతం పూర్తవుతుంది. వ్యాపారం చేసేవారికి శుభప్రదంగా ఉంటుంది. గ్రహణ సమయంలో కేతు, రవి గ్రహాల జపాలు చేసుకుంటే మంచిది.
4. వృశ్చికరాశి:
ఈ రాశివారికి సూర్య గ్రహణం శుభప్రదంగా ఉంటుందని, గ్రహణ ప్రభావం వల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి శ్రమ ఫలిస్తుంది. ఈ రాశివారు ఫైనాన్షియల్ గా లాభపడే అవకాశాలు, ఫ్యామిలీ నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశికి చెందిన వారు నవగ్రహ జపం చేసినట్లయితే శుభ ఫలితం కలుగుతుంది.
5. మకర రాశి:
మకర రాశి వారికి సూర్య గ్రహణం కలసివస్తుంది. ఈ సమయంలో వీరికి ఖర్చులు పెరిగినా, మరోవైపు నుండి ఆర్థికంగా లాభాలు రావచ్చు. అదృష్టం ఈ రాశివారి వైపు ఉంటుంది. వీరు ఈ సమయంలో ఇల్లు, భూమి లేదా వాహనం కొనవచ్చు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఐదు రాశుల పై నేడు వచ్చే సూర్యగ్రహణ ప్రభావంమూడు నెలల పదహారు రోజుల పద్దెనిమిది గంటల పాటు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Also Read: సనాతన ధర్మం, హిందూ ధర్మం… ఈ రెండు ఒకటే అనుకుంటాం..! కానీ ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఉందా..?










ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఖుష్బూ. కోలీవుడ్ లో ఏకంగా ఆమెకు అభిమానులు గుడినే కట్టారు. నార్త్ లో పుట్టి, పెరిగిన ఖుష్బూ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొన్నేళ్ళ పాటు అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, మరో వైపు రాజకీయాలలో రాణిస్తూ, తమిళనాడు పాలిటిక్స్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఇప్పటికే ఒక నటిగా, ప్రొడ్యూసర్ గా, రాజకీయ నాయకురాలుగా రాణిస్తున్న కుష్బూ రీసెంట్ గా అరుదైన గౌరవం పొందింది.
కేరళ త్రిస్సూర్ లో విష్ణు మాయ దేవాలయంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది చేసే నారీ పూజలో కూర్చునే అవకాశం సీనియర్ నటి కుష్బూకి దక్కింది. కుష్బూని ఆలయకమిటీ ఆహ్వానించగా, కుష్బూ నారీ పూజకు హాజరైంది. ఆలయంలో ఒక పీఠం పై కుష్బూని కూర్చోపెట్టి పూజారులందరు పూజలు చేశారు. ఆ తరువాత కుష్బూకు నైవేద్యాలు ఇచ్చి, దీవించారు. కుష్బూ పూజకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో “దేవుని ఆశీర్వాదలు అందుకున్నాను.
త్రిస్సూర్‌లోని విష్ణుమాయ దేవాలయం నారీపూజ కోసం ఆహ్వానించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.నారీపూజ కోసం ఎంపికైన వారిని మాత్రమే ఆహ్వానిస్తారు. దైవమే స్వయంగా ఆ వ్యక్తిని ఎన్నుకుంటుందని వారు నమ్ముతారు. నాకు ఇంతటి గౌరవాన్ని కలిగించినందుకు, ఆశీర్వదించినందుకు ఆలయంలోని ప్రతి ఒక్కరికీ నా వినయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రతిరోజూ ప్రార్థించేవారికి, తమను రక్షించే సూపర్ పవర్ ఉందని నమ్మే వారందరికి, ఈ పూజ మంచిని తెస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను”. అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవి అన్నాచెల్లెళ్ళు. ఒకసారి మహావిష్ణువు పరమేశ్వరుడిని చూడటానికి కైలాసానికి వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు తన మేనల్లుడు అయిన గణపతిని వైకుంఠం తీసుకుని వెళ్ళాడు. అక్కడ సుదర్శన చక్రంతో సహా తన ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టాడు. అయితే బాల గణపతి బంగారు కాంతులతో మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకుని, సైలెంట్ గా కూర్చున్నాడు. ఆ తరువాత విష్ణువు చక్రం కనిపించకపోయేసరికి దాని కోసం వెతకడం ప్రారంభించాడు.
విష్ణువు ఏం చేస్తున్నాడో అర్ధం కానీ గణపతికి గుంజీలు తీయడం విచిత్రంగా అనిపించి, విపరీతమైన నవ్వు వస్తుంది. కడుపు నొప్పిచేంతగా గణపతి నవ్వాడు. అలా నవ్వుతున్న సమయంలో గణపతి కడుపులోని చక్రం బయటకి వస్తుంది. దాంతో శ్రీ మహావిష్ణువు ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఆ రోజు నుండి వినాయకుడి ముందు గుంజీలు తీయడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులు గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి గుంజీలు తీయడం మొదలుపెట్టారు.
ఉత్తర కర్ణాటక సావాజీ కమ్యూనిటీకి చెందిన వారు శ్రావణ మాసాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రావణం నుండి వినాయక చతుర్థి వరకు మాంసాహారాన్ని తినరు. మాంసాహార డైట్ ను ఎలుకల వీక్ మొదలవుతుంది. తొలి రోజు మోదక, కడుబు వంటి తీపి ఆహారాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు వినాయకుడి మూషికానికి ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా ఎలుకలు మొక్కలకు హాని చేస్తాయి. ఇలా ఎలుకలను పూజిస్తూ, హాని కలిగించకూడదని ప్రార్ధిస్తారు.
నాన్ వెజ్‌లో వంటకాలలో మటన్ వంటకాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. మటన్ మసాలా, మటన్ ఖీమా, మటన్ బోటీ తదితర వాటిని నైవేద్యంగా పెడతారు. అయితే కొందరు చికెన్, చేపలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎడ్మి, రోటీ మొదలైన వంటకాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా వినాయకుడికి మాంసాహార వంటకాలు నైవేద్యంగా సమర్పించడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

పెళ్లి అయిన మహిళలు పూజలు, వ్రతాలు చేస్తూ, దేవుడిని కొలుస్తూ ఉంటారు. అయితే పెళ్లి అయిన స్త్రీలు భర్తను కోల్పోయిన తరువాత వారిని శుభకార్యాలకు, పూజలకు దూరంగా ఉండాలని కొందరు అంటుంటారు. వితంతువులు పూజలు, వ్రతాలకు దూరంగా ఉంటారు. అయితే శాస్త్ర ప్రకారం, భర్తలేని మహిళలు పూజలు చేయకూడదు అనేది ఎక్కడా లేదు. భగవంతుడి పూజాకు ఎలాంటి తప్పు లేదా దోషం లేదని పండితులు చెబుతున్నారు.
అయితే పసుపు కుంకుమలు ఇవ్వడం, కొన్ని రకాల పూజలు అంటే భార్యాభర్తలు పీటల మీద కూర్చునే పూజలు తప్ప మిగతా పూజలకు, దేవుడిని పూజించడానికి ఎలాంటి తప్పు లేదు. కార్తీక పురాణంలో ఒక స్త్రీ భర్త, తండ్రి మరణించిన తరువాత కార్తీక వ్రతం చేసుకుందని, కార్తీక స్నానం చేసిందని, ఏకాదశి వ్రతం చేసిందని, విష్ణు పూజ చేసిందని, ఆ తరువాత కావేరీ నది స్నానం చేస్తుదాగానే మరణించి, మరుసటి జన్మలో ఆమె సత్యభామగా జన్మించిందని చెప్పబడిందని పండితులు చెప్పారు.
అందువల్ల భర్త లేని స్త్రీలు కార్తీక వ్రతం, మార్గశిర వ్రతం. ఏకాదశి వ్రతం, షణ్ముఖ దీపోత్సవం, కార్తీక దీపోత్సవం, వసంత పంచమి దీపోత్సవం, ఉగాది, వసంత నవరాత్రులు, శ్రీరామ నవమి పూజలకి గాని ఎలాంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు.




s

