శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆరోజున ప్రతి మహిళ కూడా అమ్మవారికి పూజ చేస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం పొందొచ్చు. అయితే శుక్రవారం నాడు పూజ మాత్రమే కాకుండా కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించడం ముఖ్యం. వీటిని పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అలానే ఏ సమస్య లేకుండా జీవితం అంతా సాఫీగా వెళ్లిపోతుంది.
శుక్రవారం కేవలం అమ్మవారికి మాత్రమే కాదు శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. అయితే శుక్రవారం నాడు ఈ విధంగా అనుసరిస్తే మరింత మేలు కలుగుతుంది.

మామూలుగా మనం లైట్లన్నీ ఆపేస్తే నిద్రపోతూ ఉంటాము. కానీ శుక్రవారం నాడు లైట్లు వేసి ఉంచితే మంచి కలుగుతుంది. ఇంట్లో తప్పని సరిగా ఈశాన్య దిశ వైపు ఏదైనా ఒక లైట్ ని వేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి వస్తుందని పండితులు అంటున్నారు. నిత్యం అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి హారతి కర్పూరం తెచ్చి ఆ బూడిదను పర్సులో ఉంచుకుంటే అదృష్టం మీ వెంట ఉంటుంది.
Also Read: ఆనవాయితీ ఉంటేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా? ఆనవాయితీ లేకుండా ఈ వ్రతం చేసుకుంటే ఏమవుతుంది?

శుక్రవారం నాడు భర్త ఇలా చేస్తే… భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది..!
అలానే శుక్రవారంనాడు ఆవుకి పచ్చ గడ్డి వేయడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది. మీరు భోజనం చేయడానికి ముందు నెయ్యి, బెల్లం తీసుకువెళ్లి ఆవుకి పెడితే కూడా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి రావాలంటే శుక్రవారం నాడు గోమాతకి పూజ చేయాలి. సమస్యల నుండి బయట పడడానికి పంచముఖ దీపాన్ని వెలిగిస్తే ఏ సమస్యా రాదు. భర్త ఏదైనా బహుమతిని భార్యకి శుక్రవారం సాయంత్రం ఇస్తే జీవితాంతం ఎంతో అన్యోన్యంగా వుంటారు.
Also Read: పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం దేనికి సంకేతమో తెలుసా? ఏమైనా కీడు జరుగుతుందా?



శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారము రామావతారము. దేవుడు అయినప్పటికి రాముడు జన్మించినప్పటి నుండి అవతారం చాలించే వరకు మానవుడుగానే జీవించారు. తన వ్యక్తిత్వంతో, సకల గుణాలతో అందరికి ఆదర్శంగా నిలిచి దేవుడిగా మారాడు. అందుకే సకల గుణాభిరాముడిగా పిలుస్తారు. తండ్రి మాట కోసం 14 ఏళ్ల పాటు అరణ్యవాసం చేసాడు. సీతను ఎత్తుకెళ్లిన రావణుడితో యుద్ధం చేసి, భార్యను తిరిగి పొందాడు. అయోధ్యకు తిరిగివచ్చిన తరువాత రాజుగా పట్టాభిషేక్తుడు అయ్యాడు. ఆయన పాలించిన సమయాన్ని రామరాజ్యం అని పిలుస్తారు.
రామాయణం ఉత్తర కాండలో రామరాజ్యం గురించి స్పష్టమైన వివరాలు లేనప్పటికీ, రామాయణం ప్రారంభం నుండి రాముడి వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి మహర్షి వాల్మీకి చెప్పిన విషయాలను అనుసరించి రామరాజ్యం గురించి అర్ధం చేసుకోవచ్చు. శ్రీ రాముడు పట్టాభిషిక్తుడైన అనంతరం 11 వేల సంవత్సరాల పాటు అయోధ్యని పాలించాడు. శ్రీ రాముడి పాలన చాలా ఆదర్శవంతమైనది. వేద శాస్త్రాల ప్రకారం ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వాడు. ఎవ్వరినీ కష్ట పెట్టలేదు. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు. ఎవరి ధర్మాలు వారు పాటించేవారు.
రాజ్యం బాగుండడం అంటే అక్కడి ప్రజలందరు ధనవంతులు అని కాదు. శ్రీ రాముని పాలనలో దొంగతనం, కరవు లేదని అంటారు. రాముని పాలనలో ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో సంతృప్తిగా జీవించేవారట. వర్షాలు సరైన సమయంలో పడేవట. నెలలో మూడు సార్లు వర్షం కురవడంతో పంటలు బాగా పండేవి. రాజ్యం సశ్యామలంగా ఉండేదట. రాముని రాజ్యంలో అందరికి సమంగా న్యాయం జరిగేది. అందువల్లనే రామరాజ్యం అని చెబుతారు.














ముఖేష్ అంబానీ దేశంలోని చాలా పుణ్యక్షేత్రాలకు తరచూగా వెళుతుంటారు. అయితే ఈ దేవాలయాలలో ఒకటైన నాథద్వారాలో ఉన్న శ్రీనాథ్ దేవాలయం. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి చాలాకాలం నుండి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. ఈ దేవాలయాన్ని అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్టుడు శ్రీనాథుడు అవతారంలో కొలువై వున్నాడు.
17వ శతాబ్ధంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మహారాజా రాజాసింగ్ ఈ ఆలయాన్ని కట్టించారు. శ్రీనాథ్ ఆలయానికి విశాలమైన ప్రాంగణం ఉంది. ఆలయంలోనికి వెళ్లేందుకు నాలుగు వైపులా ద్వారాలు నిర్మించి ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీనాథుడు శ్యామల వర్ణంలో కనిపిస్తాడు. ఈ ఆలయానికి రాజస్థాన్‌కు ప్రజలు తరచూగా వస్తుంటారు. హోలీ పండుగ రోజు ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో ఆలయం జనంతో నిండిపోతుంది.
ఈ త్రినాథ్ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని అంటారు. ఇక ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ నాథద్వారా ఉదయపూర్ కు దగ్గరగా ఉంది. నాథద్వారాకు ట్రైన్ లేదా విమానంలో ఉదయ్‌పూర్ వరకు వెళ్ళి, అక్కడి నుండి త్రినాథ్ ఆలయానికి వెళ్లవచ్చు.
