గ్రహణ సమయంలో ఆచరించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నిజానికి చాలా మందికి గ్రహణ సమయంలో ఎటువంటి పనులు చేయాలి..? ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలు తెలియవు. గ్రహణ సమయంలో మనం చేసే పనుల పట్ల శ్రద్ధ పెట్టాలి అని చాలా మంది భావిస్తారు.
పైగా పెద్దలు చెప్పే వాటిని కూడా ఫాలో అవుతూ వుంటారు. గ్రహణ సమయంలో అన్నం వండకూడదు, గ్రహణ సమయంలో అన్నం తినకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మరి గ్రహణ సమయంలో అన్నం వండకూడదా..? అన్నం తినకూడదా ఒకవేళ తింటే ఏం అవుతుంది అనేది చూద్దాం.

నిజానికి గ్రహణ సమయంలో అన్నం వండచ్చు మరియు గ్రహణ సమయంలో అన్నం తినచ్చట. గ్రహణం సమయంలో అన్నం వండకుండా ఉండడం, తినకుండా ఉండడం లాంటివి చెయ్యక్కర్లేదు. చాలా మంది గ్రహణానికి రెండు గంటల ముందు కానీ ఒక గంట ముందు కానీ తినేస్తూ వుంటారు. కానీ అలా ఏమి చెయ్యక్కలేదు అని నిపుణులు అంటున్నారు.

సైన్టిఫిక్ గా చూస్తే అన్నం వండకుండా ఉండడం, తినకుండా ఉండడం లాంటివి చెయ్యక్కలేదుట. దీని వలన ఏ సమస్య ఉండదు అని అంటున్నారు. గ్రహణం పట్టిన సమయంలో అన్నం వండచ్చు, తినచ్చు లేదంటే తినకుండా కూడా ఉండచ్చు. అలానే గ్రహణం వలన గ్రహణం మొర్రి వస్తుందని పెద్దలు అంటారు. కానీ దీనికి కారణం ఇది కాదు అని నిపుణులు అంటున్నారు. సైన్టిఫిక్ గా చూస్తే ఇది జన్యుపరంగా వస్తుంది అని తెలుస్తోంది.

సూర్యగ్రహణం అంటే ఏమిటి..?
భూమికి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు భూమికి సూర్యునికి మధ్య వచ్చినప్పుడు సూర్య గ్రహణాన్ని ఖగోళ సంఘటన అంటారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే చంద్రుడు నీడ భూమి మీద డైరెక్ట్ గా పడుతుంది దీని మూలంగా సూర్యుడు కనపడడు. దీనిని సూర్య గ్రహణం అని అంటారు.






























