పెళ్లిలో నుదుటున “బాసికం” ఎందుకు కడతారో తెలుసా.? శరీరంలో జరిగేది ఇదే.!

పెళ్లిలో నుదుటున “బాసికం” ఎందుకు కడతారో తెలుసా.? శరీరంలో జరిగేది ఇదే.!

by Anudeep

Ads

హైందవ సాంప్రదాయ ప్రకారం పెళ్లి కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంతకంటే ముఖ్యమైన ప్రాధాన్యత ఆ పెళ్లి జరిపించే విధివిధానాలకు, ఆచారాలకు మరియు సంప్రదాయాలకు ఉంటుంది.

Video Advertisement

కానీ ఈమధ్య పెరిగిన టెక్నాలజీ పరంగా చాలామంది కొత్త పద్ధతులు అలవర్చుకుంటున్నారు. పెళ్లి ఏర్పాట్లలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినప్పటికీ కొన్ని తప్పనిసరిగా అనాది నుంచి మారకుండా వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి తాళి ,తలంబ్రాలు, బాసికం. విదేశాల్లో స్థిరపడిన వధూవరులైన సరే సాధ్యమైనంత వరకు మన సంప్రదాయాలకు విలువ ఇచ్చి అన్ని శాస్త్రం ప్రకారమే జరిపించడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.

మన సంప్రదాయం ప్రకారం జరిగే వివాహాలలో అతి ముఖ్యమైన అంశం పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి బాసికం కట్టడం.ఈ బాసికం అనేది కేవలం అలంకారం కోసం కట్టే వస్తువు కాదు. దీని వెనక ఆధ్యాత్మికమైన శాస్త్రీయపరమైన కొన్ని కారణాలు లాభాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటారు. మరి ఈ బాసికం కట్టడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా…

పెళ్లి రోజు పెళ్లి కూతురుతో అస్సలు అనకూడని 6 విషయాలు

మన శరీరంలో మొత్తం 72 వేల నాడులు ఉండగా అందులో 14 నాడులు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరాన్ని అన్నివేళలా ఉత్తేజంగా చురుకుగా ఉంచడానికి అత్యంత ప్రధానమైనవి. ఈ 14 నాడుల్లో కూడా పింగళ,సుషుమ్మ, ఇడ అనేవి అత్యంత ముఖ్యమైన నాడులు అని మన పెద్దల నమ్మకం.సుషుమ్న అనబడే నాడికి సూర్యనాడి కుడి పక్కన ఉండగా , చంద్రనాడి ఎడమ పక్కన ఉంటుంది.


మన నుదుటి భాగంలో ఈ రెండు నాడులు కలవడం వల్ల ఒక అర్థ చంద్రాకారం ఏర్పడుతుంది. మన వేదాల ప్రకారం ఈ భాగాన్ని ఋషులు దివ్యచక్షువు అని పిలుస్తారు. నుదుటభాగాన బ్రహ్మ కొలువుంటాడని కొందరు కాబట్టి వివాహం లాంటి శుభకార్యాలు జరిగే సమయంలో ఇతరుల దృష్టి ఈ దివ్యచక్రంపై సోకకుండా ఉండడానికి అడ్డుగా బాసికం నుదుటకు కడతారు. ఇలా చేయడం వల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకి ఎలాంటి కీడు కష్టం రాదని పెద్దల నమ్మకం. అందుకే చాలా వరకు బాసికాలు అర్థ చంద్రాకారం త్రిభుజాకారం లేక చతురస్త్రాకారంలోనే ఉంటాయి.


End of Article

You may also like