ఎక్కడైనా ఏదైనా సరదాగా జరిగినపుడు.. లేదా అనుకోకుండా ఇన్సిడెంట్ లు జరిగినపుడు ఎవరైనా వాటిని వీడియో లు తీసి నెట్టింట్లో పెడితే అవి ఎక్కడైనా ఏదైనా సరదాగా జరిగినపుడు.. లేదా అనుకోకుండా ఇన్సిడెంట్ లు జరిగినపుడు ఎవరైనా వాటిని వీడియో లు తీసి నెట్టింట్లో పెడితే అవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతోంది. నడిరోడ్డు పై కుక్కలు వెంటపడితే మీరు ఐతే ఏమి చేస్తారు..?
ముందు భయపడ్డా.. వాటిని ఎదుర్కోడానికి ప్రయత్నించడమో.. లేక సైలెంట్ గా తప్పుకోవడానికి ప్రయత్నించడమో చేస్తారు. కానీ.. ఈ అమ్మాయి ఏమి చేసిందో తెలుసా..? ఆ కుక్కలన్నిటి మధ్యలో డాన్స్ వేసేసింది. ఆ కుక్కలకు కూడా ఏమి చేయాలో అర్ధం కాక ఆ అమ్మాయి వైపే చూస్తున్నాయి. ఆ అమ్మాయి ఏకం గా వాటి ముందుకు వెళ్లి.. వెనక్కి వస్తూ చలాకి గా డాన్స్ చేస్తుండడాన్ని ఎవరో సోషల్ మీడియా లో పెట్టారు. దీనిని రూపిన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి ట్విట్టర్ లో పంచుకున్నారు.
ఈ వీడియో ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరేమో ఆమె సమయస్ఫూర్తి కి మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో.. పిచ్చి పీక్స్ లో ఉంది అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ సరదా వీడియో ను మీరు కూడా చూసేయండి మరి. మీకేమి అనిపిస్తోందో కామెంట్స్ లో తెలియచేయండి.
Basanti इन कुत्तों के सामने …☺️????
Basanti kutton ke saamne naachin….☺️☺️?? pic.twitter.com/rtn4r8PpMw
— Rupin Sharma IPS (@rupin1992) July 17, 2021