కర్ణాటక లోని మంగళూరులోని క్రిస్టియన్ మేనేజ్మెంట్ ఉన్న ఒక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం మరియు ప్రధాని నరేంద్ర మోడీ గురించి అవమానకరమైన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై ఉపాధ్యాయునిపై నిరసన వ్యక్తం వ్యక్తం చేశారు. పాఠశాల ముందు హిందూ అనుకూల సంఘాలతో కలిసి నిరసన చేపట్టారు. అసలు ఏం జరిగిందంటే మంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ హెచ్ ఆర్ ప్రైమరీ స్కూల్లో ఈ సంఘటన జరిగింది.
హిందూ దేవుళ్లను అవమానించడమే కాకుండా హిందూ పురాణాల గురించి తప్పుగా పిల్లలకు ఒక టీచర్ నేర్పిస్తున్నట్లు విద్యార్థులు ఇచ్చిన సమాచారం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు తీవ్ర నిరసన చేపట్టారు.స్థానిక బిజెపి ఎమ్మెల్యే వేద వ్యాస్ కామత్ వీరికి అండగా నిలిచారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర అభివృద్ధి ఉద్రిక్తత నెలకొంది. హిందూ మతానికి వ్యతిరేకంగా విద్యార్థుల మనసులను విషపూరితం చేయటం, ఇతర మతాలకు చెందిన విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చటానికి కుట్రలు పన్నుతున్నారని హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే 2002 గుజరాత్ అల్లర్ల గురించి, గోద్రా ఘటన గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆ టీచర్ బోధిస్తున్నారని చెప్పారు. రామాయణం, మహాభారతం లాంటి పురాణాలు వట్టి కల్పితాలని చెప్పటం సంచలనంగా మారింది. బజరంగ్దళ్ విహెచ్పి సభ్యులు స్కూల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగి టీచర్ ని వెంటనే సస్పెండ్ చేయమని డిమాండ్ చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంగళూరు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ విచారణ చేపట్టారు. అయితే పరిస్థితి శృతి మించుతుందని గమనించిన యాజమాన్యం తమ స్పందనను తెలియజేసింది. గత 60 సంవత్సరాలుగా ఇలాంటి సంఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని, ఈ సంఘట తమ పాఠశాల పై నమ్మకాన్ని పోగొట్టేలా ఉందని అయితే అందరి సహకారంతో మళ్ళీ ఆ నమ్మకాన్ని తిరిగి కల్పిస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు.