కరోనా కారణం గా తెలంగాణ లో కూడా లాక్ డౌన్ ను పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. సడలింపు సమయాలను మాత్రం పెంచారు. ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు నిత్యావసరాల కోసం తిరగడానికి అనుమతులు ఇచ్చారు. అయితే.. ఈ నేపధ్యం లో హైదరాబాద్ మెట్రో ట్రైన్ టైమింగ్స్ ను కూడా చేంజ్ చేసారు.

ఈరోజు నుంచి మెట్రో ట్రైన్స్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ట్రైన్స్ ను నడపనున్నారు. అయితే.. చివరి ట్రైన్ 11.45 కు బయలుదేరి చివరి స్టాప్ వద్ద 12.45 కు ప్రయాణికులను దింపేస్తుంది. ప్రజల క్షేమాన్ని, అవసరాలను దృష్టి లో పెట్టుకుని కొవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ మెట్రో ట్రైన్స్ ను నడుపుతున్నారు.










