ఇటీవలే టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ జాబితా 2020 విడుదల అయింది. ప్రతి ఏడాది విడుదల అయ్యే ఈ జాబితాలో వివిధ రంగాల్లో రాణించిన 50 మంది మహిళల పేర్లను ఉంచుతారు. సెలెబ్రిటీలందరు ఈ జాబితా విడుదల కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తారు. ఆన్ లైన్ పోల్ ఆధారంగా ర్యాంకింగ్ ను డిసైడ్ చేస్తారు. ఈ ఏడాది రియా చక్రవర్తి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

కేవలం అందం, ఆకర్షణ వంటి వాటి గురించే కాకుండా.. ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారో అన్న ప్రాతిపదికన కూడా ఈ జాబితాలో పేర్లు చేర్చడం జరుగుతుంటుంది. తెరపై కనిపించడం మాత్రమే కాకుండా.. రియా పై పలు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు కు సంబంధించి కూడా ఆమె పై పలు ఆరోపణలు ఉన్నాయి. సంయమనం పాటిస్తూ వాటిని ఆమె ఎదుర్కొంది.
























