కరోనా దెబ్బ ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో ఓ అద్భుతం చోటు చేసుకుంది.అది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఆ అద్భుతం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా?సూర్యుడు చుట్టూ ఒక బంతి ఆకారంలో ఒక లైట్ కనిపిస్తుంది.ఇది చూడడానికి ఒక గడియారంలో ఉంది.

సూర్య కిరణాలు మధ్యలో ముల్లులాగా ఉన్నాయి.దీన్నే పరిశోధకులు హలో ఆప్టికల్ ఫెనోమెనెన్ అంటున్నారు. ఇవి మబ్బుల ద్వారా ఏర్పడతాయి. మబ్బులలో ఉండే మంచు కణాలు (ఐస్ క్రిస్టల్స్) మబ్బుల మీదకి వక్రీకరించినప్పుడు (రిఫ్రాక్ట్ అయ్యినప్పుడు) ఇలా హాలో కిరణాలు అనేవి కనిపిస్తాయి. ఈ ఎఫెక్ట్ అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందట…కరోనా వల్ల బాగా ఇబ్బంది పడుతున్నామని ప్రస్తుతం మన హైదరాబాద్ లో కనిపించి అందరినీ అలరిస్తుంది.
















