మెక్సికో లో దారుణం.. ఇళ్లను మింగేసేలా పెరుగుతున్న 300 అడుగుల సింక్ హోల్..!

మెక్సికో లో దారుణం.. ఇళ్లను మింగేసేలా పెరుగుతున్న 300 అడుగుల సింక్ హోల్..!

by Anudeep

Ads

ఈ మధ్య ప్రకృతి వైపరీత్యాలు కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇటీవల మెక్సికో లో భూమి పై ఓ సింక్ హోల్ కనిపించింది. క్రమం క్రమం గా అది పెద్దదై స్థలాన్ని మింగేస్తోంది. భవనాలను కూడా మింగేసేలా స్థలాన్ని ఆక్రమించేసుకుంటోంది. దీనిని చూసి స్థానిక మెక్సికన్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత శనివారం ఇది కనిపించింది. ఇది కనిపించినప్పుడు కొన్ని మీటర్ల సైజులో మాత్రమే ఉంది. కానీ.. ఇప్పుడు 70 వేల స్క్వేర్ ఫీట్ పంటపొలాన్ని మింగేసింది.

Video Advertisement

gigantic sink hole

అంతరిక్ష నౌక ఢీకొట్టడం వలన ఈ భారీ సింక్ హోల్ ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్యూబ్లా రాష్ట్రంలోని సింక్‌హోల్ 60 మీటర్ల వ్యాసానికి పెరిగింది. ఇంకా పెరగచ్చని తెలుస్తోంది. 60 అడుగుల లోతులో ఈ సింక్ హోల్ ఉండచ్చని అంచనా వేస్తున్నారు. పంటపొలాలను ఆక్రమించిన ఈ సింక్ హోల్ సమీపం లో ఉన్న ఇళ్లను కూడా మింగేసేలా ఉంది. అక్కడి ప్రజలను సేఫ్ గా ఉండే చోటు కు తరలించారు. దీనివలన పంట నష్టం జరిగింది. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.


End of Article

You may also like